ఇది విన్నారా.. మద్యం పోటీల్లో భారతీయ మద్యానికి గోల్డ్‌ మెడల్‌!

2025 లండన్ స్పిరిట్స్ పోటీలో భారతీయ మద్యానికి గోల్డ్ మెడల్ దక్కింది. జిన్ జిజి ఇండియా డ్రై జిన్, పాల్ జాన్ విస్కీ, లాంగిట్యూడ్ 77 వంటి బ్రాండ్లు స్వర్ణ పతకాలు గెలుచుకున్నాయి. జిమ్మీస్ టానిక్ వాటర్, సోబ్రిటీ సిప్స్ వంటి నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ కూడా అవార్డులు అందుకున్నాయి.

ఇది విన్నారా.. మద్యం పోటీల్లో భారతీయ మద్యానికి గోల్డ్‌ మెడల్‌!
Jin Jiji

Updated on: Apr 30, 2025 | 7:39 PM

ఇండియా అన్నింటినీ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందులోనా మరీ ముఖ్యంగా మద్యం ఉత్పత్తిలో ఒక అడుగు ముందుంది. ఇండియా ప్రపంచానికి ఎన్నో మంచి మంచి బ్రాండ్లను పరిచయం చేసింది. లండన్‌లో జరిగిన 8వ ఎడిషన్‌ స్పిరిట్స్ పోటీలో ఇండియా 2025లో అత్యంత ధనిక బ్రాండ్‌గా స్థానాన్ని సంపాదించుకుంది. లండన్‌లో జరిగిన స్పిరిట్స్ పోటీలో విస్కీ, జిన్, రమ్, ఫెని, ఇతర మద్యాలను ప్రదర్శించారు. వాటిలో ఇండియన్ డ్రై జిన్ (జిన్ జిజి జిన్) ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన స్పిరిట్‌లలో ఒకటిగా పేరు పొందింది. బేవరేజ్‌ ట్రేడ్‌ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఈ అంతర్జాతీయ పోటీ, బ్రాండ్‌లకు వారి స్పిరిట్‌ల నాణ్యత, విలువ, ప్యాకేజింగ్ ఆధారంగా రేటింగ్‌ ఇస్తారు.

స్వర్ణం గెలిచిన ఇండియన్ స్పిరిట్స్..

జిన్ GG ఇండియా డ్రై జిన్ ఇండియా తరపున 2025 స్పిరిట్ పోటీలో స్వర్ణం గెలుచుకుంది. 98వ ర్యాంకుతో ఈ సంవత్సరం అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ బ్రాండ్‌ ఇదే. కాగా, జిన్ జిజి డార్జిలింగ్ జిన్ 92 పాయింట్లు సాధించి రజతం గెలుచుకుంది. పాల్ జాన్ ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ బ్రిలియన్స్ 96 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. ఇది ఆ సంవత్సరం అత్యుత్తమ భారతీయ సింగిల్ మాల్ట్ విస్కీగా ఎంపికైంది. సీగ్రామ్‌కు చెందిన లాంగిట్యూడ్ 77 ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ 95 పాయింట్ల స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది. అంతేకాకుండా, భారతీయ బ్రాండ్లు ఆల్కహాల్ లేని వర్గాలలో కూడా గుర్తింపు పొందాయి. భారతదేశానికి చెందిన జిమ్మీస్ ఒరిజినల్ టానిక్ వాటర్ 2025 “బిట్టర్స్ అండ్ మిక్సర్స్ ఆఫ్ ది ఇయర్” గ్లోబల్ అవార్డును గెలుచుకుంది. “నాన్-ఆల్కహాలిక్ స్పిరిట్స్” విభాగంలో భారతదేశానికి చెందిన సోబ్రిటీ సిప్స్ / డెకాఫ్ మార్టిని (డ్రైఫ్యూజన్ మిక్సాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఉత్పత్తి చేయబడింది) రజతం గెలుచుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి