IRCTC: మీ ఐఆర్‌సీటీసీ ఖాతాలో ఈ పని చేశారా? లేకుంటే టికెట్స్ బుక్ చేసుకోలేరు!
Indian Railways: కౌంటర్ బుకింగ్‌లో కూడా భారతీయ రైల్వేలు పెద్ద మార్పులు చేశాయి. రైల్వే స్టేషన్‌లోని PRS కౌంటర్ నుండి టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆధార్ ధృవీకరణ, ఓటీపీ ధృవీకరణ ఇప్పుడు తప్పనిసరి. మీరు వేరొకరికి టికెట్ బుక్ చేసుకుంటుంటే వారు..

IRCTC: అక్టోబర్ 1, 2025 నుండి భారతీయ రైల్వేలు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో పెద్ద మార్పు చేసింది. తత్కాల్ టిక్కెట్ల మాదిరిగానే జనరల్ రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ ధృవీకరణ ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. రైల్వేల ప్రకారం, టికెట్ బ్లాక్ మార్కెటింగ్, ఏజెంట్ల మోసపూరిత బుకింగ్‌లు, మోసపూరిత బుకింగ్‌లను నిరోధించడానికి ఈ చర్య తీసుకుంది.
IRCTC టికెట్ బుకింగ్ విండో తెరిచిన తర్వాత ఉదయం 8:00 నుండి ఉదయం 8:15 వరకు, రిజిస్టర్డ్ ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈ నియమం AC, నాన్-AC తరగతులకు వర్తిస్తుంది. ఈ సమయంలో నకిలీ IDలు ఉన్న ఏజెంట్లు, ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోలేరు. అంతేకాకుండా తమ IRCTC ఖాతాను ఆధార్‌తో లింక్ చేసిన ఐఆర్‌సీటీసీ వినియోగదారులు కూడా మొదటి 15 నిమిషాల్లో కన్ఫర్మ్ టిక్కెట్లను బుక్ చేసుకోలేరు.
ఇది కూడా చదవండి: Viral Video: సీటు కోసం గొడవ.. మెట్రోలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు ప్రయాణికులు!
కౌంటర్ బుకింగ్‌లో కూడా మార్పులు:
కౌంటర్ బుకింగ్‌లో కూడా భారతీయ రైల్వేలు పెద్ద మార్పులు చేశాయి. రైల్వే స్టేషన్‌లోని PRS కౌంటర్ నుండి టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆధార్ ధృవీకరణ, ఓటీపీ ధృవీకరణ ఇప్పుడు తప్పనిసరి. మీరు వేరొకరికి టికెట్ బుక్ చేసుకుంటుంటే వారు ప్రయాణికుల ఆధార్ నంబర్, ఓటీపీ కూడా అందించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఒక శిశువు అంతర్జాతీయ విమానంలో జన్మిస్తే ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది?
మీ IRCTC ఖాతాతో ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి?
1. మీ IRCTC ఖాతాతో మీ ఆధార్‌ను లింక్ చేయడానికి ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.
2. తర్వాత, “మై ప్రొఫైల్” విభాగానికి వెళ్లి “లింక్ యువర్ ఆధార్” లేదా “ఆధార్ KYC” ఎంపికను ఎంచుకోండి.
3. మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
4. మీ ఆధార్ నంబర్ నమోదు చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్‌లో అందుకున్న OTPని నమోదు చేసి “సమర్పించు”పై క్లిక్ చేయండి.
5. ఈ OTPని సమర్పించిన తర్వాత మీ ఖాతా ఆధార్‌తో ధృవీకరణ పూర్తవుతుంది.
మీ IRCTC ఖాతా ఆధార్‌తో లింక్ చేస్తే మీరు మొదటి 15 నిమిషాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మోసపూరిత IDలు, ఏజెంట్ మోసాన్ని నివారిస్తుంది. ఈ మార్పు వెయిట్‌లిస్ట్ టిక్కెట్లను తగ్గిస్తుంది. సాధారణ ప్రయాణికులు రిజర్వ్ చేసిన టిక్కెట్లను పొందడం సులభతరం చేస్తుంది. ఇది కాకుండా ప్రస్తుతం IRCTCలో 14.15 కోట్ల మంది రిజిస్టర్డ్ వినియోగదారులు ఉన్నారు. కానీ 1.85 కోట్ల మంది మాత్రమే ఆధార్‌తో తమ ఖాతాలను ధృవీకరించుకున్నారు.
ఇది కూడా చదవండి: FASTag: మీకు ఫాస్టాగ్ లేదా.. మీకో గుడ్‌న్యూస్.. కేంద్రం ఊరట..!
ఇది కూడా చదవండి: Viral Video: దొంగల ప్లాన్ అట్టర్ ప్లాప్.. షాపులోకి రాగానే కనిపించకుండా పోయారు.. ఫాగింగ్ యంత్రంతో బెడిసికొట్టింది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








