Indian Railways: హైడ్రోజన్ రైలు రెడీ.. ఈ ఏడాదే లాంచింగ్.. ప్రత్యేకతలు ఇవే..

|

Aug 06, 2024 | 3:32 PM

Hydrogen Train: నూతన ఆవిష్కరణల దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బుల్లెట్ రైళ్లు వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ మధ్యలోనే పూర్తి స్థాయి హైడ్రోజన్ రైలు పరిచయం చేసేందుకు సమాయత్తమవుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చి దిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న జాతీయ హైడ్రోజన్ మిషన్‌తో భారతీయ రైల్వే అనుసంధానమై ఈ ప్రాజెక్టును చేపట్టింది.

Indian Railways: హైడ్రోజన్ రైలు రెడీ.. ఈ ఏడాదే లాంచింగ్.. ప్రత్యేకతలు ఇవే..
Hydrogen Train
Follow us on

భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్తోంది. ఒకప్పుడు బొగ్గు ఇంజిన్లతో నడిచిన రైళ్లు ఆ తర్వాత డీజిల్ ఇప్పుడు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ రైళ్లుగా రూపాంతరం చెందాయి. కాగా వాటిని ఆధునిక హంగులు జోడిస్తూ.. కొన్ని సంవత్సరాల క్రితం వందే భారత్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది విజయవంతం కావడంతో మరిన్ని నూతన ఆవిష్కరణల దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బుల్లెట్ రైళ్లు వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ మధ్యలోనే పూర్తి స్థాయి హైడ్రోజన్ రైలు పరిచయం చేసేందుకు సమాయత్తమవుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చి దిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న జాతీయ హైడ్రోజన్ మిషన్‌తో భారతీయ రైల్వే అనుసంధానమై ఈ ప్రాజెక్టును చేపట్టింది. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి తొలి భారతీయ హైడ్రోజన్ రైలును పట్టాలెక్కించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

2047 నాటికి 50 రైళ్లు..

భారతీయ రైల్వే హైడ్రోజన్ రైళ్ల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి తొలి భారతీయ హైడ్రోజన్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డు సభ్యుడు (మౌలిక సదుపాయాలు) అనిల్ కుమార్ ఖండేల్వాల్ తెలిపారు. అంతేకాక 2047 నాటికి దాదాపు 50 రైలును ప్రారంభించే ప్రణాళికల ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాక 2027 నాటికి మొట్టమొదటి బుల్లెట్ రైలును కూడా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలో మొదటి హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ట్రాక్ లో ఉందని వివరించారు. ఈ చర్యలన్నిటి వెనుక ఉన్నప్రధాన ఉద్దేశం.. మన రైల్వేలోని కార్బన్ పాదముద్రను తగ్గించడంతో పాటు అన్ని కార్యకలాపాలలో క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ఇంటిగ్రేట్ చేయడమని ఆయన పేర్కొన్నారు. అలాగే రైళ్ల భద్రత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పురోగతి గురించి కూడా మాట్లాడారు. స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ కవాచ్ విస్తరణ గురించి వివరించారు. వెర్షన్ IV కోసం తుది స్పెసిఫికేషన్‌లు ఖరారు చేసినట్లు కూడా ఖండేల్వాల్ ప్రకటించారు.

హైడ్రోజన్ తో ప్రయోజనం ఏమిటి..

హైడ్రోజన్ రైలు పర్యావరణ హితంగా పనిచేస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న వాటితో పోల్చితే కాలుష్యాన్ని తగ్గిస్తాయి. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసినప్పుడు ఇంజిన్ కు అవసరమయ్యే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఒక హైడ్రోజన్ రైలులో ఎనిమిది బోగీలుంటాయి. హరియాణా, ఝజ్జర్ జిల్లాలోని గ్రీన్‌హెచ్ కంపెనీ కొత్తగా నిర్మించిన ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (పీఈఎం) ఎలక్ట్రోలైజర్ తయారీ ప్లాంట్‌లో ఈ రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ సదుపాయాలను కూడా మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..