అటెన్షన్ ప్లీజ్.. గుళ్లకు వెళ్లే ప్రయాణికులుకు ముఖ్య గమనిక.. ట్రైన్‌లో వీటిని అస్సలు తీసుకెళ్లొద్దు!

సుదూర ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలంటే రైల్వేలు ఉత్తమ మార్గం. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ అయిన భారతీయ రైల్వేలో నిత్యం అనేకమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. భక్తుల రద్దీ, భద్రతా దృష్ట్యా రైల్వేశాఖ నిత్యం కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంటుంది. కానీ చాలా మంది ప్రయాణికులకు ఇవి తెలియక.. రూల్స్ అతిక్రమించి ఫైన్‌ కట్టడం, లేదా జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

అటెన్షన్ ప్లీజ్.. గుళ్లకు వెళ్లే ప్రయాణికులుకు ముఖ్య గమనిక..  ట్రైన్‌లో వీటిని అస్సలు తీసుకెళ్లొద్దు!
Indian Railways Rules

Updated on: Nov 26, 2025 | 11:28 AM

భారతీయ రైల్వేలో నిత్యం లక్షల మంది ప్రజలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. రైళ్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రైల్వేశాఖ అనేక మార్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగానే కొన్ని కొత్త నియమాలను కూడా జోడిస్తుంది. వీటి గురించి తెలియక చాలా మంది.. రూల్స్‌ను అతిక్రమించి.. జైలు పాలు అవుతున్నారు. కాబట్టి తాజాగా ట్రైన్‌లో ప్రయాణించేప్పుడు తీసుకెళ్లకూడని వస్తువుల్లో మరి కొన్నింటిని యాడ్ చేసింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చాలా మంది ప్రయాణీకులకు స్టవ్‌లు, గ్యాస్ సిలిండర్లు, మండే రసాయనాలు, పటాకులు, గ్రీజు, పేలుడు పదార్థాలు వంటి వస్తువులు రైళ్లలో నిషేధించబడ్డాయని తెలుసు. కానీ మన తినే వస్తువుల్లో కూడా కొన్నింటి ట్రైన్‌లో తీసుకెళ్లడం నిషేదమని మీకు తెలుసా?.. అవునూ ట్రైన్‌ జర్నీలో ఎండిన కొబ్బరి కాయలను తీసుకెళ్లడాన్ని రైల్వేశాఖ నిషేదించంది. ఎందుకంటే దీని బయటి పొర గరుకుగా ఉండి, ఏదైనా ప్రమాదం జరిగితే త్వరగా మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి రైల్వే చట్టంలోని సెక్షన్ 164, 165 ప్రకారం ఈ ఎండు కొబ్బరిని ప్రమాదకరమైన వస్తువుల జాబితాలో చేర్చారు.

ఈ రైల్వేశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఎండు కొబ్బరి కాయలను ట్రైన్‌తో తీసుకెళ్తే వాళ్లు భారీ జరిమానా లేదా జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం, అనుమతి లేకుండా మండే లేదా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్తే రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు జరిమానా విధించవచ్చు. కొన్నిసార్లు 3 ఏళ్లవరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు.

అయితే ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు.. మతపరమైన ప్రయోజనాల కోసం తమ పూజ సామాగ్రిలో భాగంగా ఒకటి లేదా రెండు కొబ్బరికాయలను తీసుకెళ్లవచ్చు. కానీ పెద్ద మొత్తం వాటిని తీసుకెళ్తే మీరు జరిమానా తప్పదు. అలాగే రైల్వే చట్టం, 1898 ప్రకారం, రైళ్లలో మద్యం సేవించడం లేదా మాదకద్రవ్యాల ప్రభావంతో ప్రయాణించడం ఖచ్చితంగా నిషేధించబడింది. హైడ్రోక్లోరిక్ యాసిడ్, టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్, గడ్డి, ఎండిన ఆకులు, వ్యర్థ కాగితాల కట్టలు, నూనె, గ్రీజు, ఇతర మండే లేదా ప్రమాదకరమైన పదార్థాలు వంటి ప్రమాదకర రసాయనాలను కూడా ట్రైన్‌లో తీసుకెళ్లకూడదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.