Railway Luggage Rules: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఇకపై అధిక లగేజీతో ప్రయాణిస్తే జరిమానాల బాదుడు

|

Mar 12, 2023 | 10:27 AM

రైళ్లలో ప్రయాణించే వారికి కొత్త లగేజీ రూల్స్‌ను ఇండియన్‌ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు తమతోపాటు ఎంత లగేజీనైనా తీసుకెళ్లేందుకు రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇకపై అలా కుదరని..

Railway Luggage Rules: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఇకపై అధిక లగేజీతో ప్రయాణిస్తే జరిమానాల బాదుడు
New Luggage Rules
Follow us on

రైళ్లలో ప్రయాణించే వారికి కొత్త లగేజీ రూల్స్‌ను ఇండియన్‌ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు తమతోపాటు ఎంత లగేజీనైనా తీసుకెళ్లేందుకు రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇకపై అలా కుదరని పేర్కొంటూ కొత్త విధానాన్ని ప్రకటించింది. అనుమతికి మించి లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులపై అధికారులు జరిమానాలు విధించనుంది. విమాన ప్రయాణాల్లో మాదిరిగా రైళ్లలో కూడా అదనపు లగేజీని తీసుకువెళ్లడానికి చార్జీ చెల్లించవల్సి ఉంటుంది. ఈ మేరకు రైళ్లలో అధిక లగేజీతో ప్రయాణించవద్దని తెల్పుతూ రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సూచించింది. మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో.. ‘ప్రయాణంలో మీ వెంట ఎక్కువ లగేజీ తీసుకెళ్లే మీ ప్రయాణంలో సగం అనందం మాత్రమే ఉంటుంది. ఎక్కువ లగేజీతో రైళ్లలో ప్రయాణించవద్దు. ఎక్కువ లగేజీతో వెళ్లేవారు పార్శిల్ ఆఫీసుకి వెళ్లి లగేజీ బుక్ చేసుకోండంటూ రాసుకొచ్చింది.

ఫస్ట్ క్లాస్‌ ఏసీలో ప్రయాణించేవారు 70 కిలోల వరకు తమతో ఫ్రీగా లగేజీ తీసుకెళ్లవచ్చు. సెకండ్‌ క్లాస్‌ ఏసీలో 50 కిలోలు, థార్డ్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్, ఏసీ చైర్ కార్ క్లాస్‌లలో 40 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. సెకండ్ క్లాస్‌లో25 కిలోల వరకు ఉంటుంది. అదనంగా తీసుకెళ్లేవారు రూ.30లు లగేజీ ఛార్జీ చెల్లించవల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ లగేజీతో ప్రయాణించేవారు పార్శిల్‌ ఆఫీస్‌లో సంప్రదించి బుక్‌చేసుకోవాలి. రైలు బయలుదేరే సమయానికి కనీసం 30 నిమిషాల ముందు బుకింగ్ స్టేషన్‌లోని లగేజీ ఆఫీస్‌లో క్యారీ-ఆన్ లగేజీని తప్పనిసరిగా సమర్పించాలి. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా బుక్‌ చేసుకోకుండా తమతో అదనంగా లగేజీ తీసుకెళ్తే బ్యాగేజీ విలువకు ఆరు రెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.