IRCTC: ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం.. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు.. ఇప్పుడు మరింత సులభం

IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. నకిలీ టిక్కెట్ల బుకింగ్‌ను నివారించేందుకు ఈ కొత్త నిబంధన తీసుకువచ్చినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు తత్కాల్ టిక్కెట్ రద్దుపై కఠిన నిబంధనలు ఉండేవి..

IRCTC: ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం.. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు.. ఇప్పుడు మరింత సులభం
Indian Railways: ఇటీవల తత్కాల్ టికెట్ల విధానంలో నిబంధనలు, సమయ వేళలు మారినట్లు సోషల్‌ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై రైల్వే స్పందించింది. ఎలాంటి నిబంధనలు, సమయ వేళలు మార్చలేదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. మరి ప్రస్తుతం తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ సమయ వేళలు, ఛార్జీల వివరాలు తెలుసుకుందాం.

Updated on: Feb 24, 2025 | 5:44 PM

భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో 2025 సంవత్సరానికి కీలకమైన మార్పులను తీసుకువచ్చింది. ట్రైన్‌ టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇకపై కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి.

రైలు టికెట్ల బుకింగ్‌లో రైల్వే శాఖ మరింత సులభతరం చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకతను పెంచడానికి ఈ మార్పులు తీసుకువచ్చినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇప్పటివరకు ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే తత్కాల్ టికెట్ బుకింగ్ ఇకపై ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానుంది. రైలు ప్రయాణికులు ఈ కొత్త సమయాన్ని గమనించి, తమ బుకింగ్‌కు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. తత్కాల్ టిక్కెట్ల కోసం ఏసీ, నాన్‌-ఏసీ కోచ్‌లకు ప్రత్యేక కోటాలను నిర్ణయించింది ఐఆర్‌సీటీసీ. కొత్త నిబంధనలతో ప్రయాణికులు కోరుకున్న సీట్లను పొందే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Gold Price: వామ్మో.. సామాన్యులకు కష్టమే..11,000 పెరిగిన బంగారం ధర.. లక్ష దాటనుందా..?

మరోవైపు ఐఆర్‌సీటీసీ డైనమిక్ ధర విధానాన్ని అమలు చేసింది. టికెట్ డిమాండ్, లభ్యతను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండేలా చర్యలు చేపట్టనుంది ఐఆర్‌సీటీసీ.

తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. నకిలీ టిక్కెట్ల బుకింగ్‌ను నివారించేందుకు ఈ కొత్త నిబంధన తీసుకువచ్చినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు తత్కాల్ టిక్కెట్ రద్దుపై కఠిన నిబంధనలు ఉండేవి. అయితే, కొత్త మార్పుల ప్రకారం 24 గంటల ముందుగా టికెట్ రద్దు చేసిన ప్రయాణికులకు రీఫండ్‌ లభించేలా ఐఆర్‌సీటీసీ మార్పులు చేసింది. ఈ నియమాలతో టికెట్ల బుకింగ్‌ మరింత సులభతరం కానుంది.

ఇది కూడా చదవండి: Azim Premji: భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త.. ప్రతిరోజూ రూ. 27 కోట్లు విరాళం.. ఇతనెవరో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి