ఇండియన్ రైల్వే.. ఇది దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. రైలు ప్రయాణాన్ని సామాన్యులు సైతం ఉపయోగించుకుంటారు. ఎందుకంటే టికెట్ ఛార్జీలు పెద్దగా ఉండవు. తక్కువ ఛార్జీల్లోనే ప్రయాణించవచ్చు. రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా టికెట్ తీసుకోవడం తప్పనిసరి. టికెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తే అది నేరం. అలాంటి సమయంలో జరిమానా చెల్లించాల్సి వస్తుంటుంది. అంతేకాదు టికెట్ లేకుండా ప్రయాణించినందుకు టీసీ చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇటీవల రైల్వే శాఖ కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల టికెట్ లేకుండా ప్రయాణించినా ఎలాంటి జరిమానా విధించదు. మీరు రైలు వెళ్లిపోతుందనే హడావుడిలో టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కినట్లయితే డెబిట్ కార్డు ద్వారా టీసీ వద్ద టికెట్ ఛార్జీలు చెల్లించవచ్చు. ఇందులో మీకు ఎలాంటి పెనాల్టీ విధించకుండానే మీరు ప్రయాణించే ఛార్జీలు మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించింది రైల్వే శాఖ.
అయితే కొందరు టికెట్ లేకుండా ప్రయాణించినట్లయితే టీసీ వద్ద స్వైపింగ్ మెషిన్ ఉంటుంది. ఇప్పటి వరకు 2జీ నెట్‌వర్క్‌తోనే అది పని చేసేది. దీని వల్ల ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల అది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు రైల్వే శాఖ వాటిని 4జీతో అనుసంధానం చేసింది. దీని వల్ల ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉంటుంది. రైల్వే బోర్డు ప్రకారం.. అధికారులు పాయింట్ ఆఫ్ సెల్లింగ్ (పీఓఎస్) మెషీన్‌లలో 2G సిమ్‌లను ఇన్‌స్టాల్ చేశారని, దీని కారణంగా మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య ఉండటంతో దానిని 4జీకి మార్చింది. ఇలాంటి సమయంలో ప్రయాణికులు టికెట్ లేకుండా రైలు ఎక్కినా టీసీ రాగానే మీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కూడా టికెట్ తీసుకునే వెసులుబాటు వచ్చింది.
ఈ మెషీన్ల కోసం రైల్వే శాఖ 4జీ సిమ్ సదుపాయాన్ని ప్రారంభించింది. అందుకే మీరు సులభంగా చెల్లింపు చేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే రిజర్వేషన్ లేకుంటే ఎక్కడికైనా రైలులో వెళ్లాల్సి వస్తే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తీసుకుని మాత్రమే రైలు ఎక్కవచ్చు. తర్వాత టీసీ వద్ద అందుకు సంబంధించిన ఛార్జీలు చెల్లించుకోవచ్చు. దీనితో పాటు మీరు ప్రయాణ సమయంలో టిక్కెట్ చెకర్ నుండి మీ టిక్కెట్‌ను కూడా పొందవచ్చు. అంతే కాకుండా హడావుడిగా ప్లాట్ ఫాం టికెట్ తీసుకుని రైలు ఎక్కి ఆ తర్వాత రైలులోనే టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. ఇందులో మీరు ఎక్కిన ప్రదేశం నుండి మీ గమ్యస్థానానికి టిక్కెట్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి