Indian Railway: రైలులో బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లు నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు? రైల్వేశాఖ సమాధానం వింటే షాకవుతారు!

| Edited By: Ram Naramaneni

Oct 22, 2024 | 8:34 PM

ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ ఏసీ కోచ్‌లలో ప్రయాణం చేసేవారు తక్కువ మందే ఉంటారు. సాధారణంగా ఏసీ కోచ్‌లు కాకుండా ఇతర కేటగిరిలో ప్రయాణిస్తుంటారు. అయితే ఏసీ కోచ్‌లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ దుప్పట్లు, దిండ్లు, బెడ్‌షీట్లు అందిస్తుంటారు. మరి వాటిని ఎన్ని రోజులకు ఉతుకుతారో రైల్వే సమాధానం వింటే షాకవుతారు..

Indian Railway: రైలులో బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లు నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు? రైల్వేశాఖ సమాధానం వింటే షాకవుతారు!
Follow us on

మీరు రైలు రిజర్వ్ కోచ్‌లో ప్రయాణించినప్పుడు, రైలు ప్రయాణంలో మీకు బెడ్‌షీట్, దిండు, టవల్, దుప్పటిని అందజేస్తుంది. అయితే ఈ బెడ్‌రోడ్‌లు, దుప్పట్లు సరిగా శుభ్రం చేయడం లేదని ప్రయాణికులు తరచూ వాపోతున్నారు. రైల్వే కూడా దీని గురించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడు ఆర్టీఐలో వచ్చిన సమాచారం వింటే షాక్ అవుతారు.

వాస్తవానికి, ప్రతి రైలు ప్రయాణం తర్వాత ఉపయోగించిన బెడ్‌ షీట్లు, దిండ్లు, దుప్పట్లు, తువ్వాలను శుభ్రం చేస్తారని రైల్వే ఒక ఆర్టీఐకి సమాధానంగా చెప్పింది. దీని కోసం రైల్వే దేశవ్యాప్తంగా అనేక లాండ్రీ స్టేషన్లను నిర్మించింది.

దుప్పట్లు నెలకు ఒకసారి:

ఇవి కూడా చదవండి

రైలు ప్రయాణాల్లో కనిపించే దుప్పట్లను ప్రతి ప్రయాణం తర్వాత శుభ్రం చేయరని రైల్వే తన సమాధానంలో పేర్కొంది. సాధారణంగా ఒక దుప్పటి నెలకు ఒకసారి లేదా గరిష్టంగా రెండుసార్లు ఉతుకుతారని తెలిపింది. అయితే ప్రయాణంలో దుప్పటి తడిసినా, మురికిగా లేదా ఘాటైన మురికి వాసన వచ్చినా ముందుగా ఉతకుతారని తెలిపింది.

దుప్పటికి ప్రత్యేక ఛార్జీ విధిస్తారా?

రైలులో ఇచ్చే దుప్పట్లు, బెడ్‌రోల్‌ల కోసం ప్రయాణీకులు ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రైలు ఛార్జీలలో ఉంటాయి. అయితే, కొన్ని రైళ్లలో నామమాత్రపు రుసుము చెల్లించి ఒక్కో కిట్‌ను విడిగా పొందవచ్చు.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. 160 రోజుల వ్యాలిడిటీతో..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి