Post Office: డబ్బులు పొదుపు చేసేందుకు పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు కూడబెట్టుకోవాలనే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. పోస్టాఫీసులు రకరకాల సేవింగ్ స్కీమ్స్ అందిస్తోంది. వీటిలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఉండదు. మంచి లాభం ఉంటుంది. పోస్టాఫీస్ అందించే స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే మంచి రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్‌లో చేరితే మీరు నెలకు రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అదే సమయంలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తాన్ని ఆయినా డిపాజిట్ చేస్తూ వెళ్లవచ్చు. ప్రతి నెల డబ్బులు పెడుతూనే ఉండాలి. పోస్టాఫీసు ఆర్‌డీ స్కీమ్ గడువు ఐదేళ్లు. ప్రతి మూడు నెలలకోసారి మీ అకౌంట్‌లో జమ చేస్తూనే ఉండాలి. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. అంటే వడ్డీ రేటు తగ్గొచ్చు లేదా.. పెరగవచ్చు.. లేదంటే అలానే స్థిరంగా కొనసాగవచ్చు.
అయితే పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌లో చేరిన వారు నెలకు రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. పదేళ్ల తర్వాత మీ చేతికి ఏకంగా రూ.16 లక్షలకు పైగా వస్తాయి. రిస్క్ అనేది ఉండదు. కచ్చితమైన బెనిఫిట్ ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వారు పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరవచ్చు. కచ్చితమైన లాభం వస్తుంది.