Market News: వారాతంలో మార్కెట్లు చాలా ఒలటైల్ గా(Volatile Market) ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. క్రమంగా కోలుకోవటంతో సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా మెటల్ రంగానికి(Metal sector) చెందిన షేర్లు మార్కెట్ ను ముందుకు నడుపుతుండగా.. అదే సమయంలో ఆటో రంగ(Auto sector) షేర్లు మార్కెట్లను కిందకు లాగుతున్నాయి.
గత నాలుగు ట్రేడింగ్ సేషన్లలో ఎన్నికల ఫలితాల హవాతో బుల్ పెరుగులు పెట్టించిన మార్కెట్లు వారాంతంలో మళ్లీ చతికిల పడ్డాయని అందరూ భావించారు. ఉదయం ఆరంభంలో సెన్సెక్స్ సూచీ 340 పాయింట్లకు పైగా నష్టాల్లో ప్రారంభమైంది. ఇదే సమయంలో మరో సూచీ నిఫ్టీ-50.. 100 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లకు పైగా కోల్పోయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ 150 పాయింట్లు పతనంతో ఆరంభమైంది. దీనికి అంతర్జాతీయ కారణాలు ప్రధానంగా మారినట్లు తెలుస్తోంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ సూచీ సైతం గ్యాప్ డౌన్ లో ప్రారంభం కావటం భారత మాక్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమౌతాయనే సూచికను అందించాయి.
ఇవీ చదవండి..
Travel Alert: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 40% తగ్గనున్న విమాన ఛార్జీలు..
Viral Photo: ఫోటోలోని ప్రముఖ వ్యాపారవేత్తను గుర్తుపట్టారా..? మీ మెదడుకు మేత..