Indian Economy: రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్.. జోస్యం చెప్పిన బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ బిలిమోరియా

|

Jul 25, 2023 | 7:24 PM

Lord Karan Bilimoria at Hyderabad: భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని.. 2060లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ బిలిమోరియా హైదరాబాద్‌లో అన్నారు.

Indian Economy: రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్.. జోస్యం చెప్పిన బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ బిలిమోరియా
Lord Karan Bilimoria
Follow us on

హైదరాబాద్, జూలై 25: 2075 నాటికి ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి గ్లోబల్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి నొక్కి చెప్పారు బ్రిటన్ ఎంపీ ఒకరు. 2060 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక దేశంగా మారుతుందని జోస్యం చెప్పారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని.. అతి త్వరలో, ప్రపంచంలోని మూడు అగ్రరాజ్యాలలో భారతదేశం ఒకటి అవుతుందని బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ బిలిమోరియా అన్నారు.

బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో జరిగిన ఓ కార్యక్రమంలో లార్డ్ కరణ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ బ్రిటన్‌ను వెనక్కి నెట్టిందని అన్నారు. చైనాను కూడా భారత్ అధిగమించగలదని ఆయన స్పష్టం చేశారు.

వచ్చే 25 ఏళ్లలో భారత జీడీపీ 32 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని.. అప్పుడు భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అన్నారు. తాను మరో అడుగు ముందకు వేసి చెబుతున్నా.. 2060 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భావిస్తున్నానని బ్రిటన్ ఎంపీ బిలిమోరియా, పీటీఐ వార్తా సంస్థ తెలిపారు. దీని ప్రకారం భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరిస్తుందన్నారు.

కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు కరణ్ బిలిమోరియాను బ్రిటన్ లార్డ్ కంట్రీ బిరుదుతో సత్కరించింది. కోబ్రా బీర్‌ను భారతదేశానికి తీసుకురావాలని యోచిస్తున్న లార్డ్ కరణ్ బిలిమోరియా కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థిల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

IMF, గోల్డ్‌మన్ సాచ్‌ల భవిష్యత్తు ఏంటంటే

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాక్స్ రెండూ 2075 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా వేసింది. వారు అందించిన సమాచారం ప్రకారం, 2075లో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్- అమెరికా వరుసగా 2,3 స్థానాల్లో ఉంటాయన్నారు. 2075లో చైనా జీడీపీ 57 ట్రిలియన్ డాలర్లు, భారత్ జీడీపీ 52.5 ట్రిలియన్ డాలర్లు, అమెరికా జీడీపీ 51.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అలాగే, 2075లో గ్లోబల్ టాప్ దేశాల జాబితాలో గణనీయమైన మార్పులు వస్తాయని భావిస్తున్నారు. ఇండోనేషియా, నైజీరియా, బ్రెజిల్‌లు కూడా అగ్రస్థానానికి వెళ్లవచ్చని అంటున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం