Indian economy: ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది.. నివేదిక విడుదల చేసిన కేంద్రం..

|

Feb 17, 2022 | 8:30 AM

బడ్జెట్‌ 2022-23(Budget)లో తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల భారత వృద్ధి రేటు(indian economy) ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే వేగంగా పుంజుకుంటుందని కేంద్రం తెలిపింది...

Indian economy: ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది.. నివేదిక విడుదల చేసిన కేంద్రం..
Economy
Follow us on

బడ్జెట్‌ 2022-23(Budget)లో తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల భారత వృద్ధి రేటు(indian economy) ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే వేగంగా పుంజుకుంటుందని కేంద్రం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందుకున్న తయారీ, నిర్మాణ రంగాలు అందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ఈ విషయాలను తెలిపింది. వ్యవసాయ రంగానికి వస్తే సాగు విస్తీర్ణంలో పెరుగుదల స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. బహుళ పంటల సాగు సైతం పుంజుకుందని చెప్పింది. అలాగే భారీ ఎత్తున కొనుగోలు, పీఎం కిసాన్‌ సహా కనీస మద్దతు ధర వంటి ప్రభుత్వ చర్యల వల్ల రైతులు లాభపడనున్నారని నివేదిక వెల్లడించింది.

2022కి గానూ ఒక్క భారత్‌ తప్ప ప్రపంచ దేశాల వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించిందని గుర్తుచేసింది. గత బడ్జెట్‌ల ద్వారా నిర్దేశించిన మార్గాలను తాజా బడ్జెట్‌ మరింత బలపరచనుందని తెలిపింది. కొవిడ్‌ మూడో దశలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడగలిగిందని నివేదిక తెలిపింది. విద్యుత్తు వినియోగం, తయారీ కార్యకలాపాలు, ఎగుమతులు, ఈ-వే బిల్లుల జనరేషన్‌ వంటి అంశాల్లో నమోదైన గణాంకాలే అందుకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది.కొవిడ్‌-19 వల్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయని.. డిమాండ్‌ పుంజుకుంటుందని వెల్లడించింది. తద్వారా ప్రైవేటు పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి గాడిలో పడుతుందని వివరించింది.

Read Also.. Amazon Offer: అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్‌.. సభ్యత్వంపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌.. వారికి మాత్రమే..!