
మన దేశంలో SBI, HDFC, ICICI ఈ మూడు పెద్ద బ్యాంక్‌లు. భారతీయ బ్యాకింగ్ వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి. అయితే ఈ బ్యాంకులు స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గత కొంతకాలం ఈ బ్యాంక్‌ల స్టాక్స్ ఇచ్చిన రాబడిని పరిశీలిస్తే.. ఈ మూడింటిలో HDFC బ్యాంక్ స్థిరమైన లాభాలను అందించింది. గత సంవత్సరంలో దాని స్టాక్ వ్యాల్యూ 14.76 శాతం పెరిగింది. కానీ స్వల్పకాలిక టర్మ్‌అప్‌లో నామమాత్రంగానే పెరిగింది. ఆరు నెలల్లో కేవలం 3.60 శాతం, మూడు నెలల్లో 1.72 శాతం, ఒక నెలలో 0.44 శాతం పెరిగింది. ఈ ట్రెండ్ HDFC బ్యాంక్ స్టాక్ వ్యాల్యూ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ. షార్ట్ టర్మ ఇన్వెస్టర్లకు తక్కువ లాభాలనే అందించింది.
HDFC విరుద్ధంగా ICICI బ్యాంక్ దాని బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్‌లో బలహీనతను ప్రదర్శిస్తుంది. బ్యాంక్ స్టాక్ వ్యాల్యూ గత సంవత్సరంతో పోలిస్తే 7.07 శాతం పెరిగింది. కానీ ఆరు నెలల్లో 5.61 శాతం, మూడు నెలల్లో 4.73 శాతం, గత నెలలో 0.68 శాతం క్షీణతలను నమోదు చేసింది.
పై రెండింటి కంటే ఎస్‌బీఐ మెరుగ్గా ఉంది. ఒక సంవత్సరంలో 18.94 శాతం, ఆరు నెలల్లో 22.78 శాతం, మూడు నెలల్లో 18.91 శాతం, ఒక నెలలో 7.31 శాతం రాబడిని అందించింది. దీని బలమైన, స్థిరమైన పనితీరు దీనిని అగ్ర భారతీయ బ్యాంకులలో నంబర్ వన్‌గా నిలుపుతోంది. భారతీయ బ్యాంకింగ్ స్టాక్ పనితీరులో అత్యుత్తమ మిడిల్, షార్ట్ టర్మ్ ఇన్వెస్మెంట్స్ టాప్‌లో ఉంది. ఈ మూడు బ్యాంకుల్లో హెడ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ స్టాక్ వ్యాల్యూ పెరుగుతోంది. లాంగ్ టర్మ్‌లో వీటిలో పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. ఎస్‌బీఐలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా ప్రస్తుతం ట్రెండ్ ఆధారంగా లాభాలు వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి