
Air Conditioner Rules: ఎయిర్ కండిషనర్లు (AC) చాలా విద్యుత్తును వినియోగిస్తాయి. వేడి ప్రాంతాలలో ప్రజలు తమ ACని 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు సెట్ చేసుకోవచ్చు. చల్లని ప్రాంతాలలో ప్రజలు తమ ACని 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువకు సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. సాధారణంగా 23-24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఒక వ్యక్తికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎయిర్ కండిషనింగ్ నిబంధనలను రూపొందించాలని యోచిస్తోంది.
దేశవ్యాప్తంగా త్వరలో కొత్త ఏసీ నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. నివేదికల ప్రకారం, ఎయిర్ కండిషనర్లు 20-28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే అందించగలవు.
అంటే AC నుండి కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. మీరు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను పొందలేరు. అదేవిధంగా మీరు 28 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను పెంచలేరు. కేంద్ర ప్రభుత్వం అలాంటి నియమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
కొన్ని దేశాలు ఇలాంటి నియమాలు:
అమెరికా, స్పెయిన్, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా మొదలైన కొన్ని దేశాలలో ఎయిర్ కండిషనింగ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. జపాన్‌లో ప్రభుత్వ భవనాలు 28 డిగ్రీల సెల్సియస్‌గా ప్రమాణీకరించారు. అమెరికాలో ఇళ్లలో ఏసీ ఉష్ణోగ్రతలను 26 డిగ్రీల సెల్సియస్‌గా సెట్ చేయాలని సిఫార్సు చేయబడింది. అయితే ఇది తప్పనిసరి కాదు.
సింగపూర్, ఆస్ట్రేలియాలలో ఏసీని 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచాలని మార్గదర్శకం. స్పెయిన్‌లో కొంత ఆసక్తికరమైన నియమం ఉంది. ఇక్కడ వేసవిలో ఏసీ ఉష్ణోగ్రతను 27 డిగ్రీల కంటే తక్కువగా సెట్ చేయకూడదు. శీతాకాలంలో ఏసీ ఉష్ణోగ్రత 19 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండకూడదు.
ఎంత విద్యుత్తు ఆదా అవుతుంది?
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రకారం.. ఏసీ ఉష్ణోగ్రతను 20-24 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేయడం వల్ల 26 శాతం విద్యుత్ ఆదా చేయవచ్చు. ఉష్ణోగ్రత పెరిగిన ప్రతి డిగ్రీకి విద్యుత్ పొదుపు 6 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Flight Sound: ప్లైట్ టేకాఫ్ అయ్యే ముందు ఈ సౌండ్ ఎందుకు వస్తుందో తెలుసా? దేనికి సంకేతం!
ఇది కూడా చదవండి: DoT New Rule: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక నెట్‌వర్క్ మారాలంటే 90 రోజులు కాదు.. 30 రోజులే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి