ప్రస్తుతం పరిస్థితిల్లో భారీ ధరకు బంగారం అమ్మడం సరైందేనా? కొంత కాలం ఆగాలా?

భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఆభరణం కాదు, సురక్షిత పెట్టుబడి. ప్రపంచ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరల పెరుగుదల మందగించినా, ప్రధాని పిలుపు మార్కెట్‌పై ప్రభావం చూపింది. నిపుణుల ప్రకారం, MCXలో బంగారం ధరలు రికార్డు స్థాయిలకు సమీపం లో ఉన్నాయి.

ప్రస్తుతం పరిస్థితిల్లో భారీ ధరకు బంగారం అమ్మడం సరైందేనా? కొంత కాలం ఆగాలా?
Gold Price India

Updated on: May 12, 2026 | 4:33 PM

భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది సంప్రదాయం, భద్రమైన పెట్టుబడి, కుటుంబ భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, బంగారం ధరల పెరుగుదల కొంత మందగించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనవసరమైన బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి కూడా మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం MCXలో గోల్డ్ ధర రూ.1,53,850 వద్ద ట్రేడవుతోంది. ధరలు ఇంకా రికార్డు స్థాయిలకు సమీపంలోనే ఉన్నప్పటికీ, కొనుగోళ్ల వేగం కొంత తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం భారీగా బంగారం కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నాయని సమాచారం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలోని పరిస్థితులు బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఆందోళనలు ముడి చమురు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. భారత్ భారీగా చమురు, బంగారం దిగుమతులు చేసుకునే దేశం కావడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం MCX గోల్డ్ ప్రస్తుతం కీలక మద్దతు స్థాయిలకు పైన కొనసాగుతోంది. రూ.1,53,000 స్థాయి ముఖ్య మద్దతుగా ఉండగా, రూ.1,55,000 వద్ద నిరోధకత కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

లెమన్ మార్కెట్స్ పరిశోధన విశ్లేషకుడు గౌరవ్‌ ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఇటీవల కనిపిస్తున్న అస్థిరతకు భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, సాంకేతిక ట్రేడింగ్ ధోరణులే ప్రధాన కారణాలు. పెట్టుబడిదారులు ప్రస్తుతం భయం, జాగ్రత్తల మధ్య నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇక మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్‌కు చెందిన రవి సింగ్‌ మాట్లాడుతూ.. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసే ధోరణి ఇంకా కొనసాగుతోందన్నారు. ప్రపంచ ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us