India Economy: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ధ్రువంగా భారత్‌.. సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ప్రధాన ధ్రువంగా అభివృద్ధి చెందుతుందని సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గతంతో పోలిస్తే భారతదేశంతో సింగపూర్ సంబంధాలు మరింత బలపడ్డాయంటూ పేర్కొన్నారు.. తన రెండు రోజుల ఒడిశా పర్యటన ముగింపు సందర్భంగా షణ్ముగరత్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

India Economy: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ధ్రువంగా భారత్‌.. సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు
Pm Modi Tharman Shanmugaratnam

Updated on: Jan 19, 2025 | 12:16 PM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ప్రధాన ధ్రువంగా అభివృద్ధి చెందుతుందని సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గతంతో పోలిస్తే భారతదేశంతో సింగపూర్ సంబంధాలు మరింత బలపడ్డాయంటూ పేర్కొన్నారు.. తన రెండు రోజుల ఒడిశా పర్యటన ముగింపు సందర్భంగా షణ్ముగరత్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.. సింగపూర్ భవిష్యత్తు కోసం భారతదేశం వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. “భౌగోళికంగా, ఆర్థికంగా బహుళ ప్రపంచంలో భారతదేశం ఒక ధ్రువంగా ఉండాలని కోరుకుంటోంది” అని ఆయన అన్నారు. జనాభాపరమైన ప్రయోజనం, అభివృద్ధి పథం, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, ఎగుమతి సామర్థ్యాన్ని ఉటంకిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలలో భారతదేశ వృద్ధి అవకాశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. సింగపూర్‌లో ఇటీవలి నాయకత్వ పరివర్తన ద్వైపాక్షిక సంబంధాలను సానుకూలంగా ప్రభావితం చేసిందని ధర్మన్ షణ్ముగరత్నం పేర్కొన్నారు.

భారత్ తో తన సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం వివరించారు. సంబంధాలను బలోపేతం చేయడంలో ఇది కొనసాగింపును నిర్ధారిస్తుందని ధర్మన్ షణ్ముగరత్నం పేర్కొన్నారు.. గత ఏడాది సింగపూర్‌లో నాయకత్వ పరివర్తనపై ఒక ప్రశ్నకు సమాధానంగా – 20 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్న లీ హ్సీన్ లూంగ్ స్థానంలో లారెన్స్ వాంగ్ వచ్చినప్పుడు – ఇది భారత్‌తో సంబంధాలపై సానుకూల ప్రభావం చూపలేదని అన్నారు.

తాము సింగపూర్-భారత్ సంబంధాన్ని బలోపేతం చేస్తూనే ఉన్నామని.. మునుపటి నాయకత్వంలో చేసినది కొత్త నాయకత్వంలో కూడా కొనసాగుతుందని షణ్ముగరత్నం తెలిపారు. ఇది ఒక తరం నాయకుల నుంచి మరొక తరం వరకు సంబంధాల నిరంతర అభివృద్ధిని సూచిస్తుందన్నారు.. ఆర్థిక సహకారాన్ని ప్రస్తావిస్తూ, షణ్ముగరత్నం రెండు దేశాల మధ్య విమాన సేవల ఒప్పందాన్ని సవరించే ప్రణాళికలను వెల్లడించారు.. చివరిగా 2005లో నవీకరించారు.. రెండు ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందాన్ని విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారత నాయకత్వంతో జతకట్టడం.. దౌత్యపరమైన సమావేశం ఇరువైపుల నుంచి ఆసక్తిని రేపుతుందని షణ్ముగరత్నం పేర్కొన్నారు. విమానయాన రంగం, వ్యాపారంలో భారతదేశం మంచి సామర్థ్యాన్ని చూపుతుందని సింగపూర్ అధ్యక్షుడు అన్నారు. MRO (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) లో గ్లోబల్ బిజినెస్‌ను కలిగి ఉన్న కొన్ని సింగపూర్ కంపెనీలు ఎలా దోహదపడతాయో ఆయన హైలైట్ చేశారు.

షణ్ముగరత్నం భారతదేశం – చైనా రెండింటితో బలమైన సంబంధాలను కొనసాగించడం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు. ఆసియా వృద్ధి, సుస్థిరత, స్థిరత్వంలో ఈ భాగస్వామ్యాల పాత్రను ఎత్తిచూపుతూ.. “సింగపూర్ శ్రేయస్సు మన ఆసియాన్ పొరుగు దేశాలైన భారతదేశం – చైనాలతో సన్నిహిత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన అన్నారు.

అభివృద్ధి చెందుతున్న రంగాలలో, ముఖ్యంగా భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ, ఉమ్మడి అభివృద్ధిలో కొనసాగుతున్న సహకారాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు. తన పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు భారతీయ ప్రవాసుల గణనీయమైన సహకారాన్ని అందించారన్నారు. సింగపూర్‌లోని భారతీయ కమ్యూనిటీలో భారతీయ సంతతికి చెందిన బహుళ-తరాల సింగపూర్ వాసులు, ఇటీవలి వలసదారులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు అవకాశాలను పెంచడంతో దోహదం చేస్తాయన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..