
సాధారణంగా కొత్త పన్ను విధానంలో (New Tax Regime) మినహాయింపులు తక్కువగా ఉంటాయని చాలామంది భావిస్తారు. కానీ, నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకుంటే ఏడాదికి రూ. 15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కూడా సరైన ప్లానింగ్‌తో ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!
కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు ప్రభుత్వం రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను కల్పిస్తోంది. అంటే మీ మొత్తం ఆదాయం నుండి నేరుగా ఈ మొత్తాన్ని తగ్గించి పన్ను లెక్కిస్తారు.
కొత్త పన్ను విధానంలో పాత పద్ధతిలో లాగా సెక్షన్ 80C లేదా HRA మినహాయింపులు ఉండవు. కానీ, కొన్ని రకాల అలవెన్సుల ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు:
ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ జూన్ 30 వరకు పాఠశాలలకు సెలవులు.. జూలై 1న ఓపెన్..!
కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం (Taxable Income) ఉన్నవారికి ప్రభుత్వం పూర్తి పన్ను రాయితీని ఇస్తోంది. అంటే పైన పేర్కొన్న అలవెన్సులు, ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్, స్టాండర్డ్ డిడక్షన్స్ పోను మీ ఆదాయం రూ. 12 లక్షల లోపు ఉంటే, మీరు పన్ను చెల్లించక్కర్లేదు.
రూ. 15 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి తన జీతంలో కొంత భాగాన్ని NPS కంట్రిబ్యూషన్, స్టాండర్డ్ డిడక్షన్, కంపెనీ ఇచ్చే ఇతర ట్యాక్స్-ఫ్రీ అలవెన్సుల ద్వారా సర్దుబాటు చేయగలిగితే, పన్ను భారాన్ని సున్నాకు తగ్గించుకోవడం సాధ్యమే. అయితే, ఇది మీ కంపెనీ ఇచ్చే ‘శాలరీ స్ట్రక్చర్’ (Salary Structure) పై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి