Budget 2023: రూ. 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపుపై కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? క్లియర్ డీటెయిల్స్ మీకోసం..

|

Feb 02, 2023 | 8:37 AM

Income Tax New Slabs: ఏటా బడ్జెట్‌ అనగానే వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ కొన్నేళ్లుగా నిరాశే ఎదురువుతోంది. కానీ, ఈసారి అలా జరగలేదు. ఉద్యోగుల కలలను నెరవేరుస్తూ.. గుడ్ న్యూస్ చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్.

Budget 2023: రూ. 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపుపై కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? క్లియర్ డీటెయిల్స్ మీకోసం..
Income Tax New Slabs
Follow us on

ఏటా బడ్జెట్‌ అనగానే వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ కొన్నేళ్లుగా నిరాశే ఎదురువుతోంది. కానీ, ఈసారి అలా జరగలేదు. ఉద్యోగుల కలలను నెరవేరుస్తూ.. గుడ్ న్యూస్ చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్. ధరల పెరుగుదలతో అల్లాడుతున్న వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆదాయపు పన్ను స్లాబుల్లో కీలక మార్పులు చేశారు. పన్నుపోటును కాస్త తగ్గించారు.

హైలెట్ అంశం ఇదే..

మొత్తం బడ్జెట్‌లో హైలెట్ అంటే వేతన జీవులకు కల్పించిన ఊరటే అని చెప్పొచ్చు. స్టాండర్డ్‌ డిడెక్షన్‌ను రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. గతంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు దాన్ని 7 లక్షలకు పెంచారు. అంటే మినహాయింపులతో కలుపుకుంటే రూ. 7 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అయితే ఇక్కడో ట్విస్ట్ ఎంటంటే ఇదంతా కొత్త ఐదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు.. ఇకపై ఐటీ రిటర్న్ దాఖలు చేసే టైమ్‌లో కొత్త ఆదాయపు పన్ను విధానం డీఫాల్ట్ ఆప్షన్‌గా వస్తుంది.. పాత పద్ధతిలోనే ఉన్నవాళ్లు దాన్ని కొనసాగించ వచ్చు.. లేదా… కొత్త ట్యాక్స్ విధానంలోకి మారవచ్చు.

ఇవి కూడా చదవండి

కన్‌ఫ్యూజన్ ఏమీలేదు..

మన ఆదాయం రూ. 3 లక్షలలోపు ఉంటే ఎలాంటి పన్ను ఉండదు. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఆదాయం ఉంటే 5 శాతం ట్యాక్స్ కట్టాలి. రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ఆదాయం ఉంటే 10 శాతం పన్ను విధిస్తారు. అయితే ఏడు లక్షలలోపు పన్ను ఉండదు కాని.. ట్యాక్సేషన్‌ మాత్రం ఫైల్‌(ఐటీ రిటర్న్స్) చేయాలి. ఆదాయం రూ. 7లక్షల పైన 10శాతం వర్తిస్తుంది. రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉంటే 15 శాతం పన్ను చెల్లించాలి. రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయం ఉంటే 20 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇక రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే రూ. 30 శాతం ట్యాక్స్ విధిస్తారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆదాయపు పన్నుపై సర్‌ఛార్జ్‌ రేట్‌ను 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు!

నిర్మల సీతారామన్‌ ప్రకటన వేతన జీవుల్లో ఉత్సాహాన్ని నింపింది. మూడు నుంచి 7లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్‌ రిబేట్‌ లభిస్తుంది. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఫైల్‌ చేయనివారికి మాత్రం మూడులక్షల పైన ఎంత ఆదాయం ఉంటే అంత వరకు ట్యాక్స్‌ కట్‌ అవుతుంది. ఈ లెక్కలన్నీ ఇప్పుడు కాదు.. వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరానికి వర్తించనుంది.

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..