మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఇది సమయం. చాలా మంది పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి తమ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరం రిటర్న్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. ఈ మార్పులలో ఒకటి బిట్‌కాయిన్‌తో సహా వర్చువల్ డిజిటల్ ఆస్తులకు సంబంధించినది. మీరు క్రిప్టో కరెన్సీ నుంచి కూడా డబ్బు సంపాదించినట్లయితే ఈ మార్పు గురించి తెలుసుకోవాలి. ఇది కాకుండా మీకు కొన్ని ఇతర విషయాలు కూడా తెలుసుకోవాలి. లేకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు.
ఏప్రిల్ 1, 2022 నుంచి క్రిప్టో కరెన్సీతో సహా వర్చువల్ డిజిటల్ అసెట్ (VDA)కి సంబంధించిన పన్ను ఆదాయానికి ఆదాయపు పన్ను చట్టంలో ప్రత్యేక కేటాయింపులు చేశారు. అలాగే, సెక్షన్ 194S కింద కొన్ని సందర్భాల్లో కొనుగోలుదారు క్రిప్టో కొనుగోలు కోసం చెల్లింపు చేయడానికి ముందు 1% టీడీఎస్‌ని కట్ చేయాల్సి ఉంటుంది. వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుంచి ఆదాయాలను వెల్లడించడానికి షెడ్యూల్ వీడీఏ ఐటీఆర్ ఫారమ్‌కు యాడ్ చేశారు. ఇక్కడ పన్ను చెల్లింపుదారు క్రిప్టో కరెన్సీ నుంచి సంపాదించిన ఆదాయ వివరాలను ఇవ్వాలి. అలాగే అది వ్యాపార ఆదాయంగా లేదా మూలధన లాభంగా పరిగణిస్తారా లేదా అనేది చెప్పవలసి ఉంటుంది.
మీరు 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ నుంచి ఏదైనా ఆదాయాన్ని ఆర్జించినట్లయితే రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి అవసరమైన సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోండి. క్రయ, విక్రయాల తేదీ, సంపాదించిన ఆదాయం వంటి వివరాల ఇవ్వాలి. అమ్మకం నుంచి వచ్చిన ఎలాంటి ఆదాయాలు అయినా వివరాలు ఇవ్వాల్సిందే.
ఆదాయపు పన్ను రిటర్న్‌లో వర్చువల్ డిజిటల్ ఆస్తుల విషయంలో కట్ చేసిన టీడీఎస్‌ని చేర్చడానికి ట్యాక్స్‌చెల్లింపుదారులు ఫారమ్-26AS, వార్షిక సమాచార ప్రకటనని చెక్ చేయాలి. మీకు మీ జీతంతో పాటు వర్చువల్ డిజిటల్ ఆస్తి నుంచి ఆదాయం ఉంటే మీరు ITR-1ని పూరించలేరు. దీనికి బదులుగా మీరు ITR-2 నింపాలి. క్రిప్టో, నాన్-ఫంగబుల్ టోకెన్ (NFT) వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తారు.
రెండవ మార్పు డొనేషన్స్‌కు సంబంధించినది. మీరు ఏదైనా సంస్థకు డొనేషన్ ఇచ్చినత్తయితే, మీరు సెక్షన్ 80G కింద ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. దీనికి కేవలం రసీదు పని చేయదు. ఆదాయపు పన్ను ఫారమ్‌లో కొత్త కాలమ్ యాడ్ చేశారు. ఈ కాలమ్‌లో సంస్థకు చేసిన డొనేషన్ ఎంతో పేర్కొనాలి. ఇక్కడ అర్హత పరిమితికి లోబడి 50 శాతం తగ్గింపు అనుమతిస్తారు. డొనేషన్ రిఫరెన్స్ నంబర్‌ను ఫారమ్ 10BE లేదా డొనేషన్ తీసుకున్న సంస్థ ఇచ్చిన చేసిన రసీదులో పేర్కొనాలి.
తదుపరి మార్పు స్టాక్ మార్కెట్‌లోని వ్యక్తుల కోసం. ITR ఫారమ్‌లో ‘ట్రేడింగ్ ఖాతా’ పేరుతో ఒక ప్రత్యేక కాలమ్ యాడ్ చేశారు. దీనిలో వ్యక్తులు తమ ఇంట్రాడే ట్రేడింగ్ కార్యకలాపాల గురించి ప్రత్యేక సమాచారాన్ని అందించాలి. దీనిలో మీరు ఇంట్రాడే ట్రేడింగ్, టర్నోవర్, ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి వచ్చే ఆదాయాలను నివేదించాలి. ఈ కాలమ్ ITR-3 రూపంలో యాడ్ అయి ఉంటుంది.
ఇక ITR-3, ITR-4 ఫారాలు. ఇవి వ్యాపార ఆదాయం కలిగిన వారి కోసం. ఇందులో పన్ను చెల్లింపుదారు గత సంవత్సరాల్లోసెక్షన్ 115BAC కింద కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారా లేదా ఈ విధానం నుంచి బయటికి వచ్చారా అనేది చెప్పవలసి ఉంటుంది. గతంలో ఎవరైనా కొత్త పన్ను విధానాన్ని ఉపయోగించారో లేదో తెలుసుకోవడానికి ఇది పన్ను అధికారులకు సహాయపడుతుంది.
వ్యాపార ఆదాయం ఉన్న వ్యక్తులు ఒక్కసారి మాత్రమే ట్యాక్స్ విధానాల మధ్య మారవచ్చు. అంటే పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానంలోకి మారితే ఒక్కసారి మాత్రమే మళ్లీ పాత పన్ను విధానంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు సాలరీ తీసుకునే ఉద్యోగులు ప్రతి ఏడాది ట్యాక్స్ విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
మీరు కూడా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయబోతున్నట్లయితే, ఈ మార్పులు తెలుసుకోవడం మీకు ఉపయోగపడుతుంది. రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు, మీరు కొన్ని ఇతర విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. అంటే మీ ఆదాయం ఆధారంగా సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం వంటివి అన్న మాట. అలాగే సరైన హెడర్ కింద ఆదాయాన్ని చూపండి. ఐటీఆర్ ఫైల్ దాఖలు చేసిన తర్వాత దానిని ధృవీకరించడం మర్చిపోవద్దు. సాలరీ కాకుండా మరేదైనా ఆదాయం ఉంటే, రిటర్న్‌లో ఖచ్చితంగా చెప్పండి. లేకపోతే మీకు ఇబ్బంది తలెత్తవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి