National pension Scheme: నెలనెలా రూ.3వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ పని చేయండి..
చాలా మంది మలి వయస్సులో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. వారు కొడుకులు, కుమార్తెలపై ఆధారపడాల్సి ఉంటుంది.
చాలా మంది మలి వయస్సులో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. వారు కొడుకులు, కుమార్తెలపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్రం పెన్షన్ పథకాలు తెచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్(National pension Scheme)ను చిన్న దుకాణదారులకు కూడా అందిస్తోంది. ఈ స్కీమ్ కింద దుకాణదారులు 60 ఏళ్లు వచ్చిన తర్వాత రూ.3 వేల పెన్షన్(pention) పొందవచ్చు. ఈ పెన్షన్ స్కీమ్ కింద రిటైల్ ట్రేడర్లు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారు నెలవారీ కనీసం రూ.3 వేల పెన్షన్‌ను 60 ఏళ్ల వచ్చిన తర్వాత పొందేందుకు అర్హులు. అయితే ఈ స్కీమ్ నుంచి పెన్షన్ పొందేందుకు అర్హులైన వారు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ఎన్‌పీఎస్‌లో కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్‌లో రిజిస్టర్ అయ్యేందుకు దుకాణదారుడి వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఇది పూర్తిగా వాలంటరీ, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. 18 నుంచి 40 ఏళ్లు ఉన్న వారు ఈ స్కీమ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 3.25 లక్షల కామన్ సర్వీసు సెంటర్లు(సీఎస్‌సీల) ద్వారా ఈ స్కీమ్‌లో రిజిస్టర్ అవ్వొచ్చు. ఈ స్కీమ్ కోసం ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ అవసరం.
ఈ స్కీమ్‌లో రిజిస్టర్ అయిన లబ్దిదారులు మరణిస్తే.. నామినీకి(భార్యకు లేదా భర్తకు) అప్లికెంట్ల పెన్షన్‌లో 50 శాతాన్ని ఫ్యామిలీ పెన్షన్‌గా అందిస్తారు. ఈ స్కీమ్ గురించి మరింత సమాచారాన్ని maandhan.in ద్వారా పొందవచ్చు. ఎన్‌పీఎస్ ఎన్‌రోల్‌మెంట్ కోసం మీ వద్ద ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంకు అకౌంట్, జన్ ధన్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.