రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏమిటి, ఖర్చులకు సరిపడే డబ్బులు ఎలా వస్తాయనే ఆందోళన అందరికీ ఉంటుంది. అయితే ప్రణాళికా బద్దంగా జీవనం సాగిస్తే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఎల్ఐసీలోని జీవన్ ఆనంద్ పాలసీలో ప్రతి రోజూ రూ.45 పొదుపు చేస్తే 35 ఏళ్ల తర్వాత రూ.25 లక్షలు పొందే అవకాశం ఉంది. అంటే చిన్న పొదుపుతో జీవితానికి భరోసా లభిస్తుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో జీవన్ ఆనంద్ పాలసీ అనేక ప్రయోజనాలను అందిస్తోంది.
లైఫ్ ఎండో మెంట్ ప్లాన్. అంటే ప్రీమియం గడువు ముగిసిన తర్వాత కూడా బీమా కవరేజీ కొనసాగుతుంది. దీని ప్రీమియం చాలా తక్కువ. సామాన్యుల సైతం చాలా సులువుగా చెల్లించే అవకాశం ఉంది. రోజుకు కేవలం రూ.45 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. 35 ఏళ్ల తర్వాత 25 లక్షల రూపాయలు పొందే అవకాశం కలుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఈ సొమ్ము మనకు ఆర్థిక భద్రత కల్పిస్తుంది. నిశ్చింతగా జీవించే వీలుంటుంది. జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్, డెత్ బెనిఫిట్స్ తో పాటు యాక్సిడెంట్ డెత్, డిసేబిలిటీ రైడర్ కూడా ఉంది. పాలసీ ప్రీమియాన్ని చాలా సులువుగా చెల్లించవచ్చు. అలాగే రెండేళ్ల తర్వాత సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దురదష్టవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుంది. ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యానికి గురైతే విడతల వారీగా బీమా మొత్తాన్ని పంపిణీ చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి