RD schemes: ఇలా చేస్తే ఐదేళ్లలో మీరే లక్షాధికారి.. ఆ పోస్టాఫీసు పథకంతో ఎంతో లాభం

|

Nov 07, 2024 | 8:30 PM

ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా సాగాలంటే పొదుపును తప్పనిసరిగా అలవర్చుకోవాలి. దానివల్ల ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. దాని ద్వారా జీవితం సరైన మార్గంలో పయనిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కారణంగా పొదుపు ఏర్పడుతుంది. దాన్ని పెట్టుబడి పెడితే మరింత రాబడి వస్తుంది.

RD schemes: ఇలా చేస్తే ఐదేళ్లలో మీరే లక్షాధికారి.. ఆ పోస్టాఫీసు పథకంతో ఎంతో లాభం
Follow us on

సాధారణంగా అధిక ఆదాయం సంపాదించేవారే ఎక్కువ పొదుపు చేయగలరని అందరూ భావిస్తారు. కానీ పొదుపు అనేది ఒక అలవాటు. తక్కువ ఆదాయం పొందేవారు కూడా తమ స్థాయికి అనుగుణంగా పొదుపు చేసుకుంటే దీర్ఘకాలంలో అధిక రాబడి పొందుతారు. సామాన్యులు పొదుపు చేయడానికి పోస్టాఫీసు పథకాలు చాలా బాగుంటాయి. ప్రతి గ్రామంలోనూ దాదాపు పోస్టాఫీసు ఉండడం దీనికి ప్రధానం కారణం. అలాగే తక్కువ మొత్తాలను కూడా దాచుకునే అవకాశం ఉంటుంది. మహిళలు డబ్బులు దాచుకునేందుకు పోస్టాఫీసు పథకాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా రికరింగ్‌ డిపాజిట్‌ స్కీములుగా చెప్పే ఆర్‌డీలలో పొదుపు చేస్తే నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో సహా పొదుపును తీసుకునే అవకాశం ఉంటుంది. వీటిలో రూ.500, రూ.వెయ్యి, రూ.మూడు వేలు చొప్పున ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పేద మహిళలకు కూడా వీటిలో డబ్బులు కట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకనే కొత్తగా ఎన్ని పెట్టుబడి పథకాలు వచ్చినా ఆర్‌ డీలకు డిమాండ్‌ తగ్గడం లేదు.

పోస్టాఫీసుల్లోని రికరిండ్‌ డిపాజిట్‌ పథకం కాల వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అప్పటి వరకూ క్రమం తప్పకుండా దీనిలో పొదుపు చేయాలి. ఐదేళ్లకు మెచ్యురిటీ తర్వాత వడ్డీతో కలిసి పొదుపును తీసుకోవచ్చు. ప్రతి నెలా కట్టిన డబ్బులు మెచ్యురిటీ అనంతరం పెద్ద మొత్తంలో చేతికి అందుతాయి. అవసరమనుకుంటే మెచ్యురిటీ తర్వాత మరో ఐదేళ్లకు స్కీమును పొడిగించుకోవచ్చు. అలాగే ముందుగానే ఆపేయ్యాలనుకుంటే మూడేళ్ల తర్వాత మూసివేసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే ప్రీ మెచ్యూర్‌ క్లోజింగ్‌ అంటారు. ఇలా చేయడం వల్ల వడ్డీలో కోత విధిస్తారు. రికరింగ్‌ డిపాజిట్‌ పథకాలకు ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ అందిస్తున్నారు.

మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీరేటుపై సమీక్ష ఉంటుంది. అయితే ఎప్పుడూ ఇవి స్థిరంగానే కొనసాగుతాయి. వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లకు వడ్డీరేట్లు పెంచిన నేపథ్యంలో ఆర్‌డీలపై కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రికరింగ్‌ డిపాజిట్లలో పొదుపును మీ వీలును బట్టి చేసుకోవచ్చు. ప్రతి నెలా మీరు కట్టిన చిన్న మొత్తం ఐదేళ్ల తర్వాత భారీస్థాయిలో చేతికి వస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే మెచ్యురిటీ తర్వాత వడ్డీతో కలిసి రూ.72 వేలు చేతికి వస్తాయి. మూడువేలు చొప్పున కడితే రూ.2.18 లక్షలు, నెలకు రూ.5 వేల కడితే 3,64,500 అందుకోవచ్చు. అలాగే రూ.20 వేలు చొప్పున కడితే ఏకంగా 14 లక్షల రూపాయలు చేతికి వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి