ICICI Bank FD Rates: ఖతాదారులకు ఐసీఐసీఐ బంపర్ ఆఫర్.. ఫిక్స్ డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ పెంపు.. వివరాలు ఇవి..

|

Feb 08, 2023 | 2:50 PM

రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల లోపు బల్క్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేటు అమలవుతుందని పేర్కొంది. అంటే 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై 4.50 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.

ICICI Bank FD Rates: ఖతాదారులకు ఐసీఐసీఐ బంపర్ ఆఫర్.. ఫిక్స్ డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ పెంపు.. వివరాలు ఇవి..
Fixed Deposits Rates
Follow us on

దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెద్ద మొత్తంలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే మొత్తాలపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల లోపు బల్క్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేటు అమలవుతుందని పేర్కొంది. అంటే 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై 4.50 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా గరిష్టంగా 7.15 శాతం వడ్డీ రేటు అందిస్తుండటం విశేషం. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంకు ప్రకటించింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల పునరుద్ధరణకు ఈ సరికొత్త ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది.

కొత్త వడ్డీ రేట్లు ఇలా..

  • 7 రోజుల నుంచి 29 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజన్ లకు ఒకటే ఉంది.
  • 30 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజనులకు ఒకే రకంగా 5.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 46 రోజుల నుంచి 60 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది కూడా సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజన్ లకు ఒకటే ఉంది.
  • 61 రోజుల నుంచి 90 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజనులకు ఒకే రకంగా 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 91 రోజుల నుంచి 184 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 185 రోజుల నుంచి 270 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.65 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 15 నెలల నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 3 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..