
సాధారణంగా మెడికల్ లీవ్ అంటే ఓ 10, 15 రోజులు తీసుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 15 ఏళ్లగా మెడికల్ లీవ్‌లోనే ఉన్నాడు. అయినా కూడా అతనికి తన కంపెనీ ప్రతి నెలా జీతం చెల్లిస్తోంది. కానీ, అది కూడా సరిపోలేదంటూ అతను కేసు వేశాడు. అందుకే కోర్టు ఏం చెప్పింది? ఇది ఏ కంపెనీలో జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. UKలో ఇయాన్ అనే వ్యక్తి IBMలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. సెప్టెంబర్ 2008లో అతను మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా మెడికల్ లీవ్ తీసుకున్నాడు.
అతనికి నయం అయిన తర్వాత తిరిగి జాబ్ వస్తాడని కంపెనీ అనుకుంది. కానీ, అతను రాలేదు. ఓ ఐదేళ్ల తర్వాత కంపెనీ 2013లో కంపెనీపై ఫిర్యాదు చేశాడు. తన జీతం ఒక్కసారి కూడా పెంచలేదని, తనకు ఎటువంటి ఇంక్రిమెంట్లు రాలేదని అతను పేర్కొన్నాడు. దీంతో కంపెనీ ఈ లీగల్ వ్యవహారాల జోలికి పోకుండా అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. IBM అతను పనిచేసినా, చేయకపోయినా అతనికి 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏటా తన చివరి జీతంలో 75 శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ సమయంలో అతను సంవత్సరానికి సుమారు 54,000 పౌండ్లు పొందేవాడు. ఇంకా కొన్ని పాత సెలవు క్లెయిమ్‌లకు అతనికి అదనపు పరిహారం కూడా చెల్లించింది కంపెనీ. ప్రతిగా ఇయాన్ కేసును పరిష్కరించడానికి అంగీకరించాడు.
కథ అక్కడితో ముగిసిపోలేదు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2022లో ఇయాన్ మళ్ళీ IBMపై దావా వేశాడు. ఈసారి ఆరోపణ వైకల్య వివక్షత. 2013 నుండి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తన వార్షిక జీతం పెంచబడలేదని అతను వాదించాడు. ధరలు పెరుగుతున్నాయి, కానీ అతని ఆదాయం అలాగే ఉందని కోర్టుకు ఎక్కాడు. 2023లో కోర్టు ఇయాన్ కేసును నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. IBM అందించే జీవితకాల భత్యం దానికదే ఒక ముఖ్యమైన ప్రయోజనం అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ ప్రయోజనం అలా చేయగలిగే స్థితిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే లభిస్తుంది. ఇతర సాధారణ ఉద్యోగులు అలాంటి ప్రయోజనాలకు అర్హులు కారు. ప్రత్యేక హక్కు పొందిన తర్వాత అదనపు ప్రయోజనాలను డిమాండ్ చేయడాన్ని వివక్షగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి