ఎప్పటి నుంచో కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకిదే మంచి సమయం. ఆలస్యం చేసినా ఆశాభంగం కలగొచ్చు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యూందాయ్ మన దేశంలో పలు పాపులర్ కార్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. ఆయా కార్లపై ఏకంగా రూ. 2లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది. ఈనెలలోనే ఈ ఆఫర్ వివరాలను వెల్లడించింది హ్యూందాయ్ మోటార్ ఇండియా. దీనిలో హ్యూదాయ్ ఐ20, ఐ20ఎన్ లైన్, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, అల్కాజర్, కోనా ఎలక్ట్రిక్ వంటి ప్రముఖ మోడల్స్ ఉన్నాయి. వీటిపై డిస్కౌంట్లు, ఎక్స్ చేంజ్ బోనస్లు, కొన్ని కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా అందించే ప్రయోజనాలతో కలిపి వినియోగదారులు రూ. 2లక్షల వరకూ తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ లో క్రెటా, వెన్యూ వంటి మోడళ్లు లేవు.
హ్యుందాయ్ ఐ20, ఐ20 ఎన్ లైన్ .. ఈ రెండు కార్లపై ప్రస్తుతం రూ. 40,000 వరకు వివిధ ప్రయోజనాల రూపంలో తగ్గింపు లభిస్తోంది. మీరు రూ. 10 లక్షల లోపు ధర గల కారు కోసం మార్కెట్లో వెతుకుతున్నట్లయితే ఈ కార్లు మీకు మంచి ఆప్షన్. దీనిలో విస్తృత శ్రేణి ఫీచర్లు ఉంటాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లలో ఇది మీకు అద్భుతమైన ఎంపిక కావచ్చు.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్.. ఈ కారుపై మీకు రూ. 43,000 విలువ చేసే ఆకర్షణీయమైన ప్రయోజనాలు ఉన్నాయి. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, అలాగే పలు కార్పొరేట్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి, ఇది సంభావ్య కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌గా మారుతుంది.
హ్యుందాయ్ ఆరా.. ఈ నెలలో, హ్యుందాయ్ ఆరా సెడాన్ కొనుగోలుపై రూ. 33,000 వరకు ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్రయోజనాలు ఈ కారు మోడల్‌ను కొనుగోలును ప్రోత్సహిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
హ్యుందాయ్ అల్కాజర్ ఎస్‌యూవీ.. ఈ ఆగస్టు నెలలో, హ్యుందాయ్ అల్కాజార్ కారుపై రూ. 20,000 వరకు ప్రయోజనాలతో అందిస్తున్నారు . ఈ బహుముఖ మోడల్ ఆరు-సీట్లు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది, కస్టమర్‌లకు వారి ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయొచ్చు.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్.. ఈ కారు కొనుగోలుపై అన్ని రకాల ప్రయోజనాలు కలిపి రూ. 2 లక్షల వరకూ ప్రయోజనాలు ఉన్నాయి.
ఇక్కడ పేర్కొన్న డిస్కౌంట్లు ఆఫర్లు హ్యూందాయ్ అందిస్తున్న అన్ని రకాల ప్రయోజనాలను కలిపి విలువకట్టి చెప్పినవి. ఆ ఆఫర్ల గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మీ దగ్గరలోని హ్యుందాయ్ డీలర్ ను సంప్రదించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..