Bumper Offer: ఈ మధ్య కాలంలో కార్ల తయారీ సంస్థలు కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి కంపెనీలు. కరోనా కాలంలో వెనుకబడిపోయిన బిజిసెన్‌ను మరింతగా పెంచుకునేందుకు వివిధ రకాల మోడళ్లపై ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది హ్యందాయ్. ఆ ఆఫర్లలో భారీ తగ్గింపుతో కారును సొంతం చేసుకోవచ్చు రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ నెలలో మాత్రమే ఆఫర్లు వర్తిస్తాయని సదరు కంపెనీ తెలిపింది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ కస్టమర్ల కోసం తగ్గింపు అందిస్తోంది. రూ.1.5 లక్షల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ వంటి వాటి రూపంలో తగ్గింపు అందుబాటులో ఉంది. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారుపై రూ.లక్షా 50 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ కూడా కలిసి ఉంది. హ్యుందాయ్ ఐ20 కారుపై ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. రూ.10 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ తగ్గింపు పొందొచ్చు.
గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై కూడా తగ్గింపు అందిస్తోంది. రూ.35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ కూడా సొంతం చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఆరా కారుపై కూడా రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. కార్పొరేట్ తగ్గింపు రూ.5 వేలు లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ కింద రూ.35 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తోంది. హ్యుందాయ్ శాంట్రో కారుపై రూ.25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. కాగా ప్రాంతం, షోరూమ్, వేరియంట్ ప్రాతిపదికన ఆఫర్ మారుతూ ఉంటుందని కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది.