
దేశంలోని దిగ్గజ కార్ల కంపెనీల్లో హ్యూందాయ్ ఒకటి. అధిక పనితీరు, అత్యాధునిక ఫీచర్లతో ఈ కంపెనీ కార్లు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో హ్యూందాయ్ మరో కొత్త కారును మార్కెట్‌కు పరిచయం చేసింది. హ్యూందాయ్ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న క్రెటా నుంచి మరో కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. దీనికి హ్యూందాయ్ క్రెటా ఎన్‌లైన్ అని పేరు పెట్టింది. ఈ ఎన్‌లైన్ వేరియంట్‌లు ఇప్పటికే ఐ20, వెన్యూల్లో ఉంది. ఇప్పుడు క్రెటా ఎస్‌యూవీగా ఎన్‌లైన్ వేరియంట్‌ను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఈ హ్యూందాయ్ క్రెటా ఎన్‌లైన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
క్రెటా ఎస్‌యూవీ పాత వేరియంట్‌తో పోల్చితే ఈ కొత్త ఎన్‌లైన్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో స్పల్ప మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా బంపర్స్, గ్రిల్స్‌లో ఈ మార్పు ఉంటుంది. రెడ్ యాక్సెంట్స్ వస్తాయి. 18 అంగుళాల రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్, రేర్ స్పాయిలర్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి ఉంటాయి. ఈ కొత్త ఎన్‌లైన్ ఎస్‌యూవీ కారు మూడు మోనోటోన్, ఒక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అట్లాస్, వైట్, ఎబిస్, బ్లాక్, టైటాన్, గ్రేమ్యాట్, అట్లాస్ వైట్ విత్ ఎబిస్ బ్లాక్ రూఫ్, థండర్ బ్లూ విత్ ఎబిస్ బ్లాక రూఫ్, షాడో గ్రే విత్ ఎబిస్ బ్లాక్ రూఫ్‌లలో లభ్యమవుతోంది. ఇక ఇంటిరీయర్ విషయానికి వస్తే ఆల్ బ్లాక థీమ్‌లో వస్తుంది. రెడ్ యాక్సెంట్స్ ఉంటాయి. గేర్ లివర్, స్టీరింగ్ వీల్, బ్లాక్ లెథరేట్ సీట్ అప్ హోలి స్ట్రీల మీద ఎన్‌లైన్‌బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి. ఇంకా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. యాంబియెంట్ లైటింగ్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉంటాయి.
ఈ ఎస్‌యూవీలో బోస్ మ్యూజిక్ సిస్టమ్, వైర్ లెస్ చార్జర్, 360 డిగ్రీల సరౌండ్ కెమెరా, పానారోమిక్ సన్ రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్యూయల్ డ్యాష్ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీట్, లెవల్-2 అడాస్ స్యూట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి
ఈ ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఎన్8, ఎన్10. ఈ రెండింటికీ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది 158హెచ్‌పీ పవర్, 253ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ డీసీటీ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఇది కేవలం 8.9 సెకండ్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
కొత్తగా లాంచ్ అయిన హ్యూందాయ క్రెటా ఎన్‌లైన్ ధర రూ. 16.82లక్షల నుంచి రూ. 20.3లక్షలు(ఎక్స్ షోరూం) మధ్య ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..