Hyderabad’s First Tesla EV: తెలంగాణలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్‌ కారును కొన్నది ఎవరో తెలుసా?

Hyderabad's First Tesla EV: ఎలక్ట్రిక్‌ కార్లలో అత్యంత టెక్నాలజీతో కలిగిన కారు ఇది. ప్రపంచంలోనే అత్యధికమంది కొనుగోలు చేస్తున్న కారు ఇది. టెస్లా షోరూమ్ ను హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది. దాంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ..

Hyderabads First Tesla EV: తెలంగాణలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్‌ కారును కొన్నది ఎవరో తెలుసా?

Updated on: Oct 06, 2025 | 2:53 PM

Hyderabad’s First Tesla EV: హైదరాబాద్‌లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. ముంబయిలోని టెస్లా షోరూం నుంచి కొంపల్లికి చెందిన డాక్టర్ కోడూరు ప్రవీణ్ ఈ కారును కొనుగోలు చేశారు. ఆయన ముంబైలో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలి సారి టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా ప్రవీణ్ కోడూరు నిలిచారు. మన దేశంలో ఇప్పటివరకు 5 టెస్లా కార్లు ఉండగా.. ఆరో టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా డాక్టర్ ప్రవీణ్ కోడూరు. అయితే ముంబైలో ఈ కారును కొనుగోలు చేసినందుకు హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు 22 శాతం ట్యాక్స్‌ కూడా చెల్లించినట్లు సదరు కొనుగోలుదారు ప్రవీణ్‌ తెలిపారు. ప్రవీణ్‌ కొంపల్లిలోని శ్రీనందక అడ్వాన్స్‌డ్‌ సర్జరీ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్‌ ల్యాప్రోస్కోపిక్‌, లేజర్‌ సర్జన్‌ గా పనిచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Public Holiday: ఇక్కడ అక్టోబర్‌ 7న పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ టెస్లా షోరూమ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రానికి వెళ్లి కారు కొనుగోలు చేస్తే ట్యాక్స్‌ భారం పడుతుందని, ఇలాగే హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే ట్యాక్స్‌ భారం పెద్దగా ఉండదని అన్నారు. తెలంగాణలో తొలి సారి టెస్లా కారును తాను కొనుగోలు చేసినందుకు ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఆ కారును నడుపుకొంటూ పుణేలో ఒకసారి, షోలాపూర్ లో మరోసారి కారును ఛార్జింగ్‌ చేసినట్లు చెప్పారు. దాదాపు 770 కి. మీ. ప్రయాణించి హైదరాబాద్ వచ్చామని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రిక్‌ కార్లలో అత్యంత టెక్నాలజీతో కలిగిన కారు ఇది. ప్రపంచంలోనే అత్యధికమంది కొనుగోలు చేస్తున్న కారు ఇది. టెస్లా షోరూమ్ ను హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది. దాంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీ కింద రోడ్ టాక్స్ మినహాయింపు ఉంటుందని అన్నారు. ఈ కారు ధర రూ.63 లక్షలు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ఆంటిలియా రహస్యాలు.. ముఖేష్‌ అంబానీ ఇంట్లో పని చేసే చెఫ్‌కి జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి