Keeway: భారత మార్కెట్లోకి హంగేరియన్ టూవీలర్ బ్రాండ్.. హైదరాబాద్ యూనిట్ విస్తరించే యోచనలో కంపెనీ..!

|

May 28, 2022 | 5:17 PM

Keeway: చైనీస్ యాజమాన్యంలోని హంగేరియన్ బ్రాండ్ కీవే మే 17న దానికి సంబంధించిన మూడు ఉత్పత్తులతో భారత్ లోకి ప్రవేశించింది. 25 శాతం మార్కెట్ వాటాపై కంపెనీ కన్నేసింది.

Keeway: భారత మార్కెట్లోకి హంగేరియన్ టూవీలర్ బ్రాండ్.. హైదరాబాద్ యూనిట్ విస్తరించే యోచనలో కంపెనీ..!
Keeway
Follow us on

Keeway: చైనీస్ యాజమాన్యంలోని హంగేరియన్ బ్రాండ్ కీవే మే 17న దానికి సంబంధించిన మూడు ఉత్పత్తులతో భారత్ లోకి ప్రవేశించింది. కంపెనీ ప్రవేశపెట్టిన K-Light 250V ఒక 250cc క్రూయిజర్ మోటార్‌సైకిల్, రెట్రో-ప్రేరేపిత సిక్స్టీస్ 300i స్కూటర్, Vieste 300 maxi స్కూటర్లు ఉన్నాయి. భారతీయ మార్కెట్ లోని వినియోగదారుల కోసం వీటిన ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ చైనాకు చెందిన కియాన్‌జియాంగ్ గ్రూప్‌కు చెందినది. అదే మాతృ సంస్థ బెనెల్లీని కలిగి ఉంది. కీవే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బెనెల్లీ ఇండియాలా కాకుండా కంపెనీ 300cc తక్కువ సెగ్మెంట్, భారతీయ వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఆసక్తి ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది. దాదాపు 7 ఏడేళ్ల పాటు మనదేశంలో తన ఉనికిని కొనసాగించిన తర్వాత.. కంపెనీ కేవలం ఉత్పత్తులను విక్రయించకుండా మార్కెట్‌ను చూసేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ అనుకున్నట్లు జరిగితే.. భారత్ బ్రాండ్‌ల తయారీ కేంద్రంగా మారవచ్చు.

బెనెల్లీ ఇండియా MD వికాస్ జబఖ్ మాట్లాడుతూ.. “కీవే భారీ తయారీదారులతో పోటీకి దిగదు. మేము 125cc, 250cc, 300cc వాహనాలను తయారు చేస్తాము. ఇది కీవే మోటార్స్‌కు ప్రధానమైనది. బహుశా భవిష్యత్తులో మేము అధిక విభాగాలను చూడవచ్చు. కానీ తక్షణ దృష్టి ఈ విభాగంపైనే ఉంటుంది. 500ccకి పైగా వాహనాల కోసం ఇప్పటికే బెనెల్లీ బ్రాండ్‌ని కలిగి ఉన్నాము. మా స్వంత ఉత్పత్తులతో మేమే పోటీ పడటం వల్ల ప్రయోజనం ఉండదు. బెనెల్లీ – కీవే షోరూమ్‌కి వచ్చే కస్టమర్లకు 12-13 ప్రత్యేకమైన ఉత్పత్తులు ఎంపికకు అందుబాటులో ఉన్నాయి. కీవే బ్రాండ్ వాహనాల ధర రూ. 1,50,000 నుంచి రూ. 4,00,000 వరకు ఉంటుంది.” అని తెలిపారు.

300-500cc వాహనాల విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు బలమైన బలం ఉంది. వీటికి తోడు ఈ విభాగంలో జావా, యెజ్డీ, హోండా వంటి వాటి అనేక కొత్త ప్లేయర్లు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. దేశంలో వాహనదారుల్లో పెరుగుతున్న అభిరుచి, ఆంకాంక్షలు, పెరుగుతున్న ఆదాయం వృద్ధికి కీలకంగా మారతాయని ఈ హంగేరీ బ్రాండ్ భావిస్తోంది. బెనెల్లీ, కీవే కలిసి ప్రీమియం టూ వీలర్ స్పేస్‌లో 25% మార్కెట్ వాటాను తీసుకురావడానికి సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం.. బెనెల్లీ ఇండియాకు హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లింగ్ ప్లాంట్ ఏడాదికి 30,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని సంవత్సరానికి 45,000 యూనిట్లకు విస్తరించవచ్చని తెలుస్తోంది. దీని కారణంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.