FD Interest Rates: ఆ మూడు బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై భారీ వడ్డీ… ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!

| Edited By: TV9 Telugu

Nov 15, 2023 | 11:45 AM

గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకున్న వరుస చర్యల వల్ల ఇటీవల కాలంలో ఎఫ్‌డీలపై వడ్డీ గణనీయంగా పెరుగుతుంది. అయితే గత మూడు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌ పడింది. అయితే గతంలో పోల్చుకుంటే ఎఫ్‌డీలపై వడ్డీ ఇంకా ఎక్కువగానే ఉందనిఆ అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం టాప్‌ త్రీ బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీను ఆఫర్‌ చేస్తున్నాయి.

FD Interest Rates: ఆ మూడు బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై భారీ వడ్డీ… ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Fixed Deposit
Follow us on

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్థిర-ఆదాయ సాధనాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకున్న వరుస చర్యల వల్ల ఇటీవల కాలంలో ఎఫ్‌డీలపై వడ్డీ గణనీయంగా పెరుగుతుంది. అయితే గత మూడు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌ పడింది. అయితే గతంలో పోల్చుకుంటే ఎఫ్‌డీలపై వడ్డీ ఇంకా ఎక్కువగానే ఉందనిఆ అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం టాప్‌ త్రీ బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీను ఆఫర్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అందించే వడ్డీలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు- సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు- సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు  4.00 శాతం
  • 46 రోజుల నుంచి  ఆరు నెలల వరకూ సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం 
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 18 నెలల 1 రోజు నుంచి 21 నెలల కంటే తక్కువ  సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 21 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం 
  • 4 సంవత్సరాల 7 నెలలు 1 రోజు తక్కువ లేదా 5 సంవత్సరాలకు సమానం సాధారణ ప్రజలకు – 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం,  సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 180 రోజుల నుంచి 270 రోజులు సాధారణ ప్రజలకు – 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.00 శాతం
  • 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 5.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.30 శాతం
  • 1 సంవత్సరం డిపాజిట్లపై సాధారణ ప్రజలకు – 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 1 సంవత్సరం నుంచి 443 రోజులు పైన: సాధారణ ప్రజలకు – 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 444 రోజులు స్పెషల్‌ ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు  7.25 శాతం సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజులు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ సమయం వరకూ సాధారణ ప్రజలకు – 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు, సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..