PF Account Balance: ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల కోసం అనేక చర్యలు చేపడుతూ ఉంటుంది. నిబంధనలు మారుస్తూ ఖాతాదారులకు సులభమైన పద్దతులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. EPFO చాలా సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. గతంలో ఏదైనా పనుల నిమిత్తం పీఎఫ్ కార్యాలయానికి వెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా ఖాతాదారుడు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో పీఎఫ్‌కు సంబంధించిన సేవలు పొందవచ్చు. అయితే మీ డబ్బును ఒక పీఎఫ్ అకౌంట్ నుంచి మరొకదానికి బదిలీ చేయాలనుకుంటే సులభమైన మార్గాల ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే దాని కోసం మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండా.. ఇంట్లో ఉండిమీ EPFని బదిలీ చేసుకోవచ్చు. మీరు పీఎఫ్ నుండి డబ్బును బదిలీ చేయాలనుకుంటే, ముందుగా మీరు UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) యాక్టివేట్ అయి ఉండాలి.
☛ ముందుగా యునైటెడ్ మెంబర్ పోర్టల్’ని సందర్శించి మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
☛ అందులో Online Service’’కి వెళ్లండి.
☛ One Member- One EPF Account (బదిలీ అభ్యర్థన)పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
☛ ప్రస్తుత ఉద్యోగానికి సంబంధించి, వ్యక్తిగత సమాచారం, పీఎఫ్ అకౌంట్‌ను ధృవీకరించండి.
☛ తర్వాత Get Details పై క్లిక్ చేయండి. తర్వాత మీరు గతంలో పని చేసిన కంపెనీ PF ఖాతా వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
☛ ఫారమ్ వెరిఫికేషన్ కోసం మునుపటి లేదా ప్రస్తుత యజమానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
☛ UAN నమోదిత మొబైల్ నంబర్ ద్వారా OTPని స్వీకరించడానికి Get OTP ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
☛ తర్వాత వచ్చిన OTPని నమోదు చేసి సబ్మిమ్ క్లిక్ చేయండి.
దీంతో ఆన్‌లైన్ డబ్బు బదిలీ ప్రక్రియ అభ్యర్థన పూర్తి అవుతుంది. మూడు రోజుల్లో బదిలీ ప్రక్రియ జరుగుతుంది. ముందుగా కంపెనీ డబ్బును బదిలీ చేస్తుంది. తర్వాత EPFO ఫీల్డ్ ఆఫీసర్ దానిని వెరిఫై చేసి ధృవీకరణ తర్వాత మీ డబ్బు బదిలీ చేయబడుతుంది. బదిలీ అభ్యర్థన పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీరు క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయడం ద్వారా స్టెటస్ చెక్ చేయవచ్చు.
Know how to transfer #EPF online
जानिए कैसे करें ईपीएफ ऑनलाइन ट्रांसफर#EPFO #SocialSecurity #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/yatkwGcl5k
— EPFO (@socialepfo) April 13, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: