Whatsapp Chat Restore: వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఇలా చేస్తే చాలు మళ్లీ రీస్టోర్ అవుతుంది!

వాట్సాప్ అనేది ఈ రోజుల్లో డైలీ లైఫ్ లో భాగమైపోయింది. పర్సనల్ విషయాల నుంచి ప్రొఫెక్షనల్ డిస్కషన్స్ వరకూ అన్నీ వాట్సాప్ లోనే ఉంటాయి. అయితే వాట్సాప్ లో ఎప్పుడైనా ముఖ్యమైన చాట్ డిలీట్ అయితే అప్పుడు ఏం చేయాలి? దాన్ని తిరిగి రీస్టోర్ చేయొచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం.

Whatsapp Chat Restore: వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఇలా చేస్తే చాలు మళ్లీ రీస్టోర్ అవుతుంది!
Whatsapp Chat Restore

Updated on: Oct 27, 2025 | 11:47 AM

వాట్సాప్ లో చాలా ముఖ్యమైన డేటా ఉంటుంది. చాలామంది పర్సనల్ విషయాలు వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటుంటారు. అలాగే మరికొంతమంది ఆఫీస్ కు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలను కూడా వాట్సాప్ వేదికగానే చర్చిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా వాట్సాప్ చాట్ డిలీట్ అయితే చాలా ఇబ్బందిగా మారొచ్చు. అయితే వాట్సాప్ డేటా అంతా ఎప్పటికప్పుడు క్లౌడ్‌లో బ్యాకప్ అవుతూ ఉంటుంది. మీరు చేసే రోజువారీ చాట్‌లన్నీ ఆటోమేటిక్‌గా గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతాయి. పొరపాటున ఏదైనా చాట్ డిలీట్ అయితే మీరు భయపడాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్ స్టెప్స్‌తో ఆ చాట్‌ను తిరిగి రీస్టోర్ చేయొచ్చు.  అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఆండ్రాయిడ్ యూజర్లు

ఆండ్రాయిడ్ యూజర్లు డిలీట్ అయిన వాట్సాప్ చాట్‌ను తిరిగి పొందాలంటే ముందుగా  వాట్సాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్‌కు వెళ్లి.. అక్కడ కనిపించే చాట్ ఆప్షన్‌పై నొక్కాలి. తర్వాత చాట్ బ్యాకప్‌లో గూగుల్ డ్రైవ్ (Google Drive) ని సెలక్ట్ చేయాలి. ఇప్పుడు ఫోన్ నుంచి వాట్సాప్ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. తర్వాత మళ్లీ ప్లేస్టోర్ నుంచి వాట్సాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. మీ నంబర్‌ను ఎంటర్ చేసి లాగిన్ అయ్యే సమయంలో మీకు చాట్ రీస్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కితే వాట్సాప్ ఛాట్‌లన్నీ తిరిగి రిస్టోర్ అవుతాయి.

ఐఫోన్ యూజర్లు

ఇకపోతే ఐఫోన్ యూజర్లు కూడా వాట్సాప్ చాట్‌ను తిరిగి పొందవచ్చు. దీని కోసం వాట్సాప్  సెట్టింగ్‌లకు వెళ్లి చాట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ ఐక్లౌడ్ (icloud)బ్యాకప్‌ను ఆన్ చేసి… చాట్ బ్యాకప్ తీసుకోండి. ఆ తర్వాత వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి. లాగిన్ అయ్యేటప్పుడు మీరు చాట్ హిస్టరీని రీస్టోర్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి