Telugu News Business How to Recover Lost UAN and Apply for PF Withdrawal Online: A Step by Step Guide
పోయిన UAN నెంబర్ ఎలా తిరిగి పొందాలి, పీఎఫ్ ఖాతా నుంచి మనీ ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసుకోండి!
పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీయాంటే మనకు UAN నెంబర్ అనేది చాలా అవసరం. అయితే చాలా మంది ఉద్యోగులు తమ UAN నంబర్‌ను మర్చిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో తమ PF ఖాతాల నుండి డబ్బులు ఎలా తీసుకోవాలో అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇకపై మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కొన్ని చిన్న స్టెప్స్ ద్వారా మీరు ఈజీగా మళ్లీ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ను తిరిగి పొంవచ్చు. తద్వారా మీ అకౌంట్‌లో ఉన్న డబ్బును కూడా తీసుకొవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది EPFకి కంట్రిబ్యూట్ చేసే ప్రతి ఉద్యోగికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) కేటాయించిన సంఖ్య. ఇది ఒక ప్రత్యేకమైన 12-అంకెల సంఖ్య, ఒక ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు మారినా ఈ UAN నెంబర్ మాత్రమే అస్సలు మారదు. మీరు వేరే కంపెనీకి వెళ్లినప్పుడు ఈ నెంబర్ ద్వారా ఈజీగా మీ పీఎఫ్ అకౌంట్‌ను మెర్జ్ చేసుకోవచ్చు. ఇలా మెర్జు చేసుకున్న తర్వాత మీరు మీ బ్యాలెన్స్‌ను చెక్ చేయడానికి, మీ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, మీ KYC వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. అయితే మీరు దీన్ని మర్చిపోతే తిరిగి ఎలా పొందాలో చూద్దాం.
UAN నంబర్‌ను ఎలా తిరిగి పొందాలి?
మీరు మీ UAN నంబర్‌ను మర్చిపోతే, దానిని తిరిగి పొందడానికి మీరు EPFO సభ్యుల e-Seva పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఇందుకోసం మీరు ముందుగా, EPFO వెబ్‌సైట్ వెళ్లి ముఖ్యమైన లింక్‌ల కింద ‘మీ UAN గురించి తెలుసుకోండి’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి క్యాప్చాను ఎంటర్ చేయండి.
తర్వాత మీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, పాన్/ఆధార్/మీ ఐడిని ఎంటర్ చేయండి.
తర్వాత మీకు ‘షో మై UAN’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.