బ్యాంక్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించండి.. తక్కువ ఖర్చుతో లక్షల్లో సంపాదించండి.!

|

Nov 01, 2021 | 6:06 PM

కరోనా కాలం.. ఆపై అంతంత మాత్రంగా వచ్చే జీతాలు.. ఇలా చాలామంది తమ బ్రతుకు జట్కా బండిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో..

బ్యాంక్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించండి.. తక్కువ ఖర్చుతో లక్షల్లో సంపాదించండి.!
Bank Customer Center
Follow us on

కరోనా కాలం.. ఆపై అంతంత మాత్రంగా వచ్చే జీతాలు.. ఇలా చాలామంది తమ బ్రతుకు జట్కా బండిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరెప్పుడైనా ఓ బిజినెస్ స్టార్ చేయాలని అనుకున్నారా.! అయితే ఇది మీకోసమే. ఈ బిజినెస్‌కు మీరు తక్కువ పెట్టుబడి పెడితే చాలు.. ఎక్కువ లాభాలు పొందొచ్చు. అదే *బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్*. ఇక్కడ బ్యాంక్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. మీరు కావాలంటే.. కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను తెరవడం ద్వారా స్వయం ఉపాధిని పొందవచ్చు. లేదా పాతది ఉన్నట్లయితే.. దాని ఆదాయాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపట్టండి.

అసలు కస్టమర్ సర్వీస్ సెంటర్(CSP) అంటే ఏంటో తెలుసుకుందాం.? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CSPని తెరిచేందుకు పలు నిబంధనలను రూపొందించింది. ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ కేంద్రాల్లో బ్యాంక్ ఖాతా తెరవడం, బీమా వంటి ముఖ్యమైన పనులను కస్టమర్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. వీటి వల్ల బ్యాంకుల్లో రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల ప్రయోజనాలు పెరిగిపోవడంతో ఖాతాదారులు తరచూ బ్యాంకులకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని తగ్గించడానికి బ్యాంకులు.. కస్టమర్ సర్వీస్ సెంటర్లను తెరుస్తున్నాయి. ఇక ఈ మినీ బ్రాంచ్‌లకు బ్యాంక్ కూడా కొంత కమీషన్ ఇస్తుంది.

CSPలో ఏయే పనులు పూర్తి చేసుకోవచ్చు.?

కస్టమర్ సర్వీస్ పాయింట్ల ద్వారా కస్టమర్లు ఖాతా తెరుచుకోవడం, నగదు జమ/విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే డబ్బు బదిలీ కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానం, KYC అప్‌డేట్, FD లేదా RD ప్రారంభం లాంటి పనులను సులభంగా పూర్తి చేయవచ్చు.

CSP తెరవడానికి ఏయే డాక్యుమెంట్స్ కావాలి..

CSPని తెరవాలంటే.. మీ వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. పోలీస్ వెరిఫికేషన్ పూర్తి కావాలి. CSPని మీ సొంత భవనంలో ప్రారంభిస్తే.. దానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఒకవేళ CSP స్టార్ట్ చేసే కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంటే.. అద్దె ఒప్పంద పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు కూడా అవసరం. ఈ డాక్యుమెంట్స్‌ను బ్యాంకు మేనేజర్‌కు సమర్పించాలి. ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా బ్యాంకుకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో మేనేజర్‌కు వివరించాలి.

ఎంత ఖర్చు అవుతుంది…

CSP తెరవడానికి అయ్యే ఖర్చు మొత్తం మీరు ఎంచుకున్న ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఉంటున్న ప్రాంతం వాణిజ్యం అభివృద్ధి చెందినది అయితే.. CSPని తెరిచే ఖర్చు ఎక్కువ అవుతుంది. లేదా లిమిట్ బడ్జెట్‌లో మీరు కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించవచ్చు. మొత్తానికి CSPని తెరిచేందుకు రూ.1-1.5 లక్షలు ఖర్చవుతుందని అంచనా.

కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ అవసరం. అలాగే ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చాలా అవసరం. విద్యుత్తు అంతరాయం తలెత్తకుండా ఉండేందుకు UPS, ఇన్వర్టర్ కూడా ఉండాలి. కస్టమర్లు కూర్చునేందుకు కుర్చీలు, టేబుల్స్ కూడా కొనాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం కస్టమర్ సర్వీస్ సెంటర్ తెరిచేందుకు రూ. 1-1.5 లక్షలకు ఖర్చు అవుతుందని అంచనా వేయొచ్చు.

కమీషన్ నుండి లాభం..

కస్టమర్ సర్వీస్ సెంటర్ ఆదాయాలు పూర్తిగా కమీషన్‌పై ఆధారపడి ఉంటాయి. ఆ కమీషన్లు ఎలా ఉంటాయో చూడండి.. ఆధార్‌తో పొదుపు ఖాతా తెరిచి కనీసం రూ. 100 డిపాజిట్ చేసినందుకు రూ.15-20 కమీషన్ పొందవచ్చు. రూ.100లోపు ఖాతా తెరిస్తే రూ.15, రూ.100పైన ఖాతా తెరిస్తే రూ.20 వరకు కమీషన్ లభిస్తుంది. RD, FD‌లపై కూడా కమీషన్ పొందవచ్చు. ఇక ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతంలో కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను తెరిచినట్లయితే.. ప్రతీ నెలా రూ.2000 అదనంగా కమీషన్ లభిస్తుంది. లావాదేవీలకు సంబంధించిన కూడా కొంత కమీషన్ పొందవచ్చు.

ఇతర ప్రయోజనాలు..

కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, ఆధార్ అప్‌డేషన్, పాన్ కార్డ్ తయారు చేయడం, ప్రింటింగ్, జిరాక్స్ మొదలైన వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది.

మీరు ప్రతి నెలా ఎంత సంపాదిస్తారు..

ప్రతీ నెలా మీరు పూర్తి చేసే పనుల ద్వారా మీ సంపాదన ఆధారపడి ఉంటుంది. ఎన్ని ఖాతాలు తెరుస్తారు, ఎన్ని టర్మ్ డిపాజిట్లు, ఎంత డబ్బు డిపాజిట్ చేయబడుతుంది, ఎంత డబ్బు విత్‌డ్రా చేయబడుతుంది, నెలలో ఎన్ని RDలు, ఫండ్ బదిలీలు ఎన్ని జరుగుతాయి.. ఇలా అన్ని సౌకర్యాల ద్వార మీరు ఒక నెలలో రూ. 80వేల-1 లక్ష వరకు సంపాదించవచ్చు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, ఆధార్ అప్‌డేషన్, పాన్ కార్డ్ తయారు చేయడం, ప్రింటింగ్, జిరాక్స్ మొదలైన వాటి ద్వారా ఆదాయాన్ని మరింతగా పెంచుకోవచ్చు.