దేశంలో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ఆధార్‌ను అన్నింటికి అనుసంధానం చేయాల్సి వస్తోంది. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును అన్నింటికి అనుసంధానించేలా చర్యలు చేపడుతోంది. ఇక ఓటర్ ఐడీ కార్డుకు ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయాలి. నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్ ఓటర్ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓటర్ల జాబితాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ గత ఏడాది ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు లేకున్నా మరో పది గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకోవచ్చు. వీటిలో.. గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్/బ్యాంక్ పాస్‌బుక్ , ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఇండియన్ పాస్‌పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫొటోగ్రాఫ్, సర్వీస్ ఐడెంటిటీ కార్డు విత్ ఫొటోగ్రాఫ్, అఫీషియల్ ఐడెంటిటీ కార్డు, యూనిక్ ఐడెంటిటీ ఐడీ కార్డులతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఎన్నికల సంఘం పోర్టల్, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడీలను అనుసంధానం చేయవచ్చు. అలాగే గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఈ ప్రక్రియను చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి