
కొన్ని సార్లు బ్యాంకు మనలను విసిగిస్తుంది. ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు సరైన స్పందన ఉండదు. కస్టమర్ కేర్ కు ఫోన్ చేసినా.. బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కు వెళ్లినా మీకు సంతృప్తికర పరిష్కారం రాదు. అలాంటి సందర్భాల్లో ఏమీ చేయలేక మిన్నకుండిపోతారు. అయితే మీకు అలాంటి పరిస్థితుల్లో ఓ ఆప్షన్ ఉంది. ఏకంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు మీ బ్యాంకుపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అందుకోసం ఆర్బీఐ ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేస్తోంది. దాని పేరు ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పథకం. దీని ద్వారా వినియోగదారులు తమ బ్యాంకులో పరిష్కారం కాని సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఉపకరిస్తుంది. దీని ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా.. చాలా వేగంగా మీ సమస్యపరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అంటే ఏమిటి? దానిలో ఎలాంటి సమస్యలపై ఫిర్యాదుచేయొచ్చు? పరిష్కారం ఎలా ఉంటుంది? తెలుసుకుందాం రండి..
బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అంటే ఓ సీనియర్ అధికారి. ఈయనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమిస్తుంది. బ్యాంకింగ్ సేవలలో లోపాలుంటే.. వాటిపై కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ అధికారికి అధికారం ఉంటుంది. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006లోని క్లాజ్ 8 ప్రకారం (జూలై 1, 2017 సవరణ ప్రకారం) ఖాతాదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి, పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు.
వినియోగదారులు ముందుగా తమ సమస్యను సంబంధిత బ్యాంకుకు తెలియజేయాలి. మీరు చేసిన ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఒక నెలలోపు బ్యాంకు నుంచి ప్రత్యుత్తరం రాకున్నా.. లేక బ్యాంక్ ఫిర్యాదును తిరస్కరించినా లేదా బ్యాంకు సమాధానంతో మీరు సంతృప్తి చెందకపోయినా మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కు ఫిర్యాదు చేయవచ్చు.
బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ రుణాలు, అడ్వాన్సులతో సహా బ్యాంకింగ్ సేవలలో లోపానికి సంబంధించిన ఫిర్యాదులను చేయవచ్చు. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ను యాక్సెస్ చేయడానికి ఈ లింక్ ను చూడండి. బ్యాంకింగ్ సేవలలో లోపాలకు కొన్ని ఉదాహరణలు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..