PF Balance Check: ఒక్క మిస్డ్ కాల్‌తో మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఎలానో తెలుసా..?

పీఎఫ్ బ్యాలెన్స్ సులువుగా ఎలా తెసుకోవాలో మీకు తెలుసా..? నాలుగు మార్గాల ద్వారా మీరు ఈజీగా మీ అకౌంట్లోని బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ పంపడం ద్వారా లేదా మెస్సేజ్ పంపడం ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం.

PF Balance Check: ఒక్క మిస్డ్ కాల్‌తో మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఎలానో తెలుసా..?
Epfo 4

Updated on: Dec 04, 2025 | 1:34 PM

EPFO Account: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ప్రతీఒక్క ఉద్యోగికి పీఎఫ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇటీవల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక సంస్కరణల్లో కూడా కంపెనీలు పీఎఫ్ అనేది ప్రతీఒక్క ఉద్యోగికి ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ఈపీఎఫ్‌ అకౌంట్ తప్పనిసరి కానుంది. అయితే కొంతమందికి పీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ను ఎలా చెక్ చేసుకోవాలనే దానిపై అవగాహన ఉండదు. పీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి డీటైల్స్ తెలుసుకుంటారు. కానీ సులువుగా బ్యాలెన్స్ చెక్ చేసుకునే మార్గాలు ఇంకా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మిస్డ్ కాల్ ద్వారా..

మీరు మిస్డ్ కాల్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీంతో వెంటనే మీ పీఎఫ్ అకౌంట్‌లో ఎంత మనీ ఉన్నాయనేది టెక్ట్స్ మెస్సేజ్ రూపంలో వస్తుంది. రెండు రింగ్‌ల తర్వాత ఆటోమేటిక్‌గా డిస్‌కెన్ట్ అయ్యి మీకు మెస్సేజ్ వస్తుంది.

ఎస్‌ఎమ్‌ఎస్ పంపడం ద్వారా

ఇక పీఎఫ్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి ఎస్‌ఎమ్‌ఎస్ పంపడం ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం EPFOHO -మీ UAN నెంబర్ -మీ భాష(TEL) ఫార్మట్‌లో 7738299899కు మెస్సేజ్ పంపాలి.

UMANG యాప్

ఇక UMANG యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ UAN నెంబర్‌ను యాప్‌తో లింక్ చేయాలి. ఆ తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.

EPFO వెబ్‌సైట్

ఇక ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లోకి వెళ్లి మీ UAN నెంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు.