Money Tips: ఈ దీపావళి నుంచే ధనవంతులయ్యేందుకు ముందడుగు వేయండి.. మనీ టిప్స్ మీ కోసం

Money Tips: దిగువ మధ్యతరగతి ప్రజలను పేదరికం భయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది. ఈ భయం నుండి విముక్తి సాధించడమే ఆర్థిక స్వేచ్ఛ అంటారు. దీపావళి పర్వదినం వేళ లక్ష్మీ దేవి కటాక్షంతో మీరు కొన్ని ప్రత్యేక విషయాలను అనుసరించడం మొదలుపెట్టడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు. ఈ చిట్కాలు పేదరికాన్ని దూరం చేసి.. మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం..

Money Tips: ఈ దీపావళి నుంచే ధనవంతులయ్యేందుకు ముందడుగు వేయండి.. మనీ టిప్స్ మీ కోసం
India Money
Follow us

|

Updated on: Nov 04, 2023 | 6:08 PM

Money Tips: దిగువ మధ్యతరగతి ప్రజలను పేదరికం భయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది. ఈ భయం నుండి విముక్తి సాధించడమే ఆర్థిక స్వేచ్ఛ అంటారు. దీపావళి పర్వదినం వేళ లక్ష్మీ దేవి కటాక్షంతో మీరు కొన్ని ప్రత్యేక విషయాలను అనుసరించడం మొదలుపెట్టడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు. ఈ చిట్కాలు పేదరికాన్ని దూరం చేసి.. మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం..

  1. డబ్బు సంపాదించడానికి ప్రేరణ ఏమిటి?: అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇల్లు, లగ్జరీ కారు మొదలైనవి మీ అవసరాలా? మీరు సంపద సృష్టిలో విజయం సాధించాలనుకుంటే పక్కా ఆర్థిక ప్రణాళికతో ముందడుగు వేయాలి. కొందరి ఆర్థిక లక్ష్యాలు, కోరికలు మరీ పెద్దవిగానూ.. మరికొందరిలో మరీ తక్కువగానూ ఉంటాయి. అందుకే సంపద సృష్టి లక్ష్యం కోసం మీ కోరిక వెనుక ఉన్న కారణం మీకు సహేతుకమైనదిగా ఉండాలి. లక్ష్యం సహేతుకమైనదిగా ఉంటే ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, జీవితంలో మీ లక్ష్య సాధన మార్గంలో వచ్చే సవాళ్లను మీరు విజయవంతంగా ఎదుర్కునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
  2. సంపాదన, ఖర్చు, పొదుపు మధ్య సంబంధం: మీరు ఎంత ధనవంతులైనా, పేదవారైనా.. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే సంపద సృష్టి అసాధ్యమే అవుతుంది. ఇతరుల జీవన ప్రమాణాలు, సామాజిక పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావం సహజంగా మన ఖర్చులపై ప్రభావాన్ని చూపుతుంటాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన వాటిలో తమ విలాసవంతమైన జీవనశైలిని చూపించుకోవాలన్న తాపత్రయం కారణంగా చాలా మంది తాము కష్టపడి పనిచేసిన డబ్బులో ఎక్కువ భాగాన్ని విలాస అవసరాల కోసం ఖర్చు చేసేస్తుంటారు. అయితే ఈ ధోరణికి విరుద్ధంగా, చాలా మంది డబ్బు ఉన్నా అనవసర ఖర్చులను నియంత్రించుకుండూ నిరాడంబరంగా ఉంటారు. ఆర్థిక స్వతంత్రం సాధించిన వారిలో చాలా మంది తమ జీవితంలో సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేస్తూ.. ఆ పొదుపును ఇతరత్రాల్లో పెట్టుబడి పెట్టినవారే ఉంటారు.
  3. మీ సంపాదన సంపాదించేలా చేయడం: డబ్బు సంపాదించడం విషయానికి వస్తే మీ సంపాదన సంపాదించేలా చేయడం(కాంపౌండ్) అత్యంత ముఖ్యమైన అంశం. మీరు రూ.1 సంపాదిస్తే.. దాన్ని రూ.10లుగా మార్చడం ఎవరికైనా పెద్ద ఛాలెంజ్. కానీ గణిత శాస్త్ర ప్రాతిపదికన మీరు చేయాల్సిందల్లా వచ్చే 10 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం మీ డబ్బు 26% చొప్పున వృద్ధి చెందేలా పెట్టుబడి పెట్టడం. మీరు 1 లక్ష రూపాయల కార్పస్‌తో ప్రారంభించారని అనుకుందాం. మీరు సంవత్సరానికి 26% చొప్పున రాబడిని పొందే చోట పెట్టుబడి పెట్టండి. ఈ 26% వార్షిక రేటు 10 సంవత్సరాలకు పైగా కొనసాగితే, మీ రూ. 1 లక్ష పదేళ్లలో రూ. 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు వచ్చే పదేళ్లలో కోటి అవుతాయి. ఒక కోటి 10 కోట్లుగా మారుతుంది. రూ.10 కోట్లు వచ్చే పదేళ్లలో రూ.100 కోట్లుగా మారుతాయి. రూ.100 కోట్లు వచ్చే పదేళ్లలో రూ.1,000 కోట్లుగా మారుతాయి. ఈ విధంగా డబ్బు పెరుగుతూనే ఉంటుంది. మీరు సంపాదించిన సొమ్ము దానికి అదే సంపాదించేటట్టు మీ పెట్టుబడి ప్రణాళికలు ఉండడం మీరు ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించేందుకు దోహదపడుతుంది.
  4. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదో అర్థం చేసుకోవడం ముఖ్యం: ధనవంతులుగా మారడం అంత సులభం కాదు. అయితే కొందరికి మాత్రం ఇది పెద్దగా కష్టమైన వ్యవహారం కూడా కాదు. పెట్టుబడి మార్గాలు ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, గోల్డ్ బాండ్‌లు, ఎఫ్‌డిలు, ఇతర సాధనాల్లో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. డబ్బు సంపాదించడం చాలా సులువుగా భావిస్తే.. ఈ పెట్టుబడి అవకాశాలు మీరు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాయి. అదే సమయంలో అధిక రాబడి కోసం అత్యాశకు పోతే చేతులు కాల్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అందుకే వీటిలో రిస్క్‌ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే వాటిలో పెట్టుబడి పెట్టాలి. అలాగే క్రిప్టోకరెన్సీ వంటి వాటిలో పెట్టుబడి చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఇవి మీ కష్టార్జితాన్ని హారతి కర్పూరంలా కరిగించగలదు. నెమ్మదిగా, క్రమబద్ధమైన పద్ధతిని అనుసరించడం ద్వారా మీరు మంచి సంపదను సృష్టించగలరన్న విషయాన్ని గ్రహించాలి.
  5. చిన్న వయసులోనే పొదుపు చేయడం ప్రారంభించండి: పేదరికం వారసత్వంగా వచ్చినా.. ధనవంతులు కావాలన్న లక్ష్యం మీలో బలంగా ఉంటే.. మీరు వీలైనంత చిన్నతనం నుంచే పొదుపు చేయడం, పెట్టుబడి చేయడం మొదలుపెట్టాలి. చిన్నప్పటి నుంచే పొదుపు చేయడం మొదలుపెడితే.. ఆ తర్వాత మీరు ఎక్కువ పొదుపు చేయాల్సిన అవసరం ఉండదు. మీ డబ్బు మీకు డబ్బును సంపాదిస్తోంది. సమయం, డబ్బు మధ్య ఈ సంబంధాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చిన్న వయస్సు నుంచే పొదుపు చేయడం మీ సంపద సృష్టిలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. దీనికి పెద్ద మొత్తం అవసరం లేదు. చిన్న మొత్తంతో కూడా మొదలుపెట్టవచ్చు.

మరిన్ని వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల కథనాలు చదవండి