SBI ATM: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP)తో ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందిస్తోంది. జనవరి 2020 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. రూ.10 వేలు.. అంతకంటే ఎక్కువ డబ్బులను విత్‌డ్రా (Cash Withdrawal) చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు బ్యాంకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో డెబిట్ కార్డు పిన్ నంబర్ లేకుండా డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వీలవుతుంది. అయితే చాలా మందికి ఓటీపీని ఉపయోగించి డబ్బులు విత్‌డ్రా ఎలా చేసుకోవాలో తెలియదు. ఏటీఎంల వద్ద నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఓటీపీ అవసరం. నగదు విత్‌డ్రా చేసే సమయంలో బ్యాంకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపిస్తుంది. ఓటీపీ అనేది నాలుగు అంకెల నంబర్. ఈ ఓటీపీ నంబర్ ఒక్కసారి విత్‌డ్రా చేసిన సమయంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ముందుగా ఎస్‌బీఐ ఏటీఎంను సందర్శించాలి. అక్కడ విత్‌డ్రా చేసే సమయంలో కావాల్సిన మొత్తాన్ని ఏటీఎం స్క్రీన్‌పై ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ స్క్రీన్ కనిపిస్తుంది. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
అయితే ఏటీఎంల వద్ద జరిగే మోసాలను అరికట్టేందుకు ఏటీఎంల ద్వారా కార్డ్ రహిత నగదు ఉపసంహరణలు చేసుకునేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందించాలని సూచిందింది ఆర్బీఐ. UPIని ఉపయోగిస్తు్న్న అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో కార్డ్‌లెస్ వ్యవస్థను సదుపాయం కల్పించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అలాగే కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాలను ఆరికట్టవచ్చని ఆర్బీఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి: