Senior Citizens: సీనియర్‌ సిటిజన్లు పన్ను ఆదా చేసుకోవాలా? ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయండి!

|

Feb 18, 2024 | 1:58 PM

మీరు ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకం గురించి తెలుసుకోవాలి. తద్వారా మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు పన్ను కూడా ఆదా అవుతుంది. ఏదైనా బ్యాంకు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం అనేది అన్ని ఇతర పెట్టుబడి ఎంపికల కంటే సురక్షితమైనదిగా భావిస్తారు. ఇది సీనియర్ సిటిజన్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో వారు సాధారణ పౌరుల కంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 0.50 శాతం వరకు ఎక్కువ వడ్డీని పొందుతారు. ఇందులో పన్ను ఆదా ఎఫ్‌డీ ఆప్షన్‌ కూడా ఉంది..

Senior Citizens: సీనియర్‌ సిటిజన్లు పన్ను ఆదా చేసుకోవాలా? ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయండి!
Fd Scheme
Follow us on

ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే సమయం సమీపిస్తున్న కొద్దీ, ప్రజలు పన్ను ఆదా కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. సీనియర్ సిటిజన్లు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ పన్ను ఆదాతో పాటు తమ డబ్బు కూడా భద్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. మీరు ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకం గురించి తెలుసుకోవాలి. తద్వారా మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు పన్ను కూడా ఆదా అవుతుంది. ఏదైనా బ్యాంకు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం అనేది అన్ని ఇతర పెట్టుబడి ఎంపికల కంటే సురక్షితమైనదిగా భావిస్తారు. ఇది సీనియర్ సిటిజన్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో వారు సాధారణ పౌరుల కంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 0.50 శాతం వరకు ఎక్కువ వడ్డీని పొందుతారు. ఇందులో పన్ను ఆదా ఎఫ్‌డీ ఆప్షన్‌ కూడా ఉంది.

పన్ను ఆదా చేసే ఎఫ్‌డీ అంటే ఏమిటి?

పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ)లు సాధారణ ఎఫ్‌డీల వలె ఉంటాయి. కానీ వాటి లాక్-ఇన్ వ్యవధి 5 ​​సంవత్సరాలు. ఇది ఒక రకమైన క్యుములేటివ్ ఎఫ్‌డీ. దీనిలో 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై మీకు వడ్డీ చెల్లిస్తారు. ఈ రకమైన ఎఫ్‌డీలో మీరు ప్రతి సంవత్సరం పొందే వడ్డీ మీ ఎఫ్‌డీ అసలు మొత్తానికి జోడిస్తారు.

ఇవి కూడా చదవండి

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై పన్ను, పన్ను మినహాయింపు అందుబాటులో..

పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేయడం వలన మీకు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. సెక్షన్ 80C కింద మీరు ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందులో మీ బీమా నుండి పోస్టాఫీసుకు చేసిన పెట్టుబడులు ఉంటాయి.

ఇప్పుడు మీ ఎఫ్‌డీ వడ్డీ నుండి ప్రతి సంవత్సరం ఆదాయాన్ని సంపాదిస్తే, వారు సంపాదించిన వడ్డీపై పన్ను చెల్లించాలి. అయితే, సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు పైబడిన వారు కూడా వారి ఎఫ్‌డీ వడ్డీ ఆదాయంపై మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTB కింద వారు రూ. 50,000 వరకు వివిధ పెట్టుబడులపై మొత్తం వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇందులో పోస్టాఫీసు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుండి వచ్చే ఆదాయం కూడా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి