ఓరీ దేవుడో ఇదెక్కడి భారం..! ప్రజల్లో పెరుగుతున్న పొట్టతో దేశానికి తీవ్ర నష్టం తప్పదట..?

మీరు ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా..? మీ బరువు పెరుగుతోందా..? చిన్న వయసులోనే షుగర్ వచ్చిందా..? అయితే అలర్ట్..! ఇది కేవలం మీ ఇంట్లో సమస్య కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద ముప్పు! అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అసలు లావు (Obesity) వల్ల దేశానికి ఇంత నష్టమా? మనం తినే తిండికి, దేశం డెవలప్‌మెంట్‌కి లింక్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఓరీ దేవుడో ఇదెక్కడి భారం..! ప్రజల్లో పెరుగుతున్న పొట్టతో దేశానికి తీవ్ర నష్టం తప్పదట..?
Diabetes,obesity Economic Impact

Edited By:

Updated on: Jan 20, 2026 | 7:17 AM

ప్రపంచాన్ని ఇప్పుడు రెండు దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఒకటి ఊబకాయం.. రెండు డయాబెటిస్! ఈ జబ్బుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ ఏకంగా 5 కోట్ల 40 లక్షల మంది పనికి దూరమవుతున్నారు. అంటే ఒక రకంగా ఒక చిన్న దేశ జనాభా మాయమైపోతున్నట్టే! ఇదే స్పీడ్‌లో వెళ్తే.. 2035 నాటికి ప్రపంచంలో సగం మంది జనాభా.. అవును సగం మంది.. ఓవర్ వెయిట్‌తో బాధపడతారట. దీనివల్ల ప్రపంచానికి ఏటా 4 ట్రిలియన్ డాలర్ల నష్టం వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

​ఇక మన భారతదేశ పరిస్థితి చూస్తే భయమేస్తుంది. డయాబెటిస్ వల్ల ఎక్కువ నష్టపోతున్న దేశాల్లో మనది రెండో స్థానం. మన దేశం మీద పడుతున్న భారం ఎంతో తెలుసా? 1.6 ట్రిలియన్ డాలర్లు! మన దగ్గర చాలామందికి చిన్న వయసులోనే షుగర్ రావడం, ఆఫీసులకు సెలవులు పెట్టడం, లేదా త్వరగా రిటైర్ అయిపోవడం వల్ల.. కంపెనీలకు, దేశానికి కోట్లలో నష్టం వస్తోంది. ​కానీ.. ఇప్పుడే మేల్కొంటే లాభం కూడా గట్టిగానే ఉంటుంది!

ప్రజల ఆరోగ్యం మీద రూపాయి ఖర్చు పెడితే.. భవిష్యత్తులో అది వంద రెట్లు తిరిగి ఇస్తుంది. అందరూ ఫిట్‌గా ఉంటే 2050 నాటికి ప్రపంచ ఎకానమీకి 11 ట్రిలియన్ డాలర్లు అదనంగా వచ్చి చేరతాయట. ఇప్పటికే అమెరికాలో కొత్త రకం మందులు (GLP-1) వాడి ఒబేసిటీని 2శాతం తగ్గించారు. మనం కూడా ఆ దిశగా వెళ్లాల్సిన టైం వచ్చింది.

ఇవి కూడా చదవండి

​ఫైనల్‌గా చెప్పేది ఒక్కటే.. కంపెనీలు, గవర్నమెంట్లు.. జబ్బు వచ్చాక మందులకు డబ్బులు ఇవ్వడం కాదు.. అసలు జబ్బు రాకుండా ముందే జాగ్రత్త పడాలి. పోషకాహారం, రెగ్యులర్ చెకప్స్ ముఖ్యం. ఎందుకంటే.. వర్కర్ ఫిట్‌గా ఉంటేనే.. దేశం హిట్ అవుతుంది! ఇది మన ఆర్థిక నిపుణులు చెబుతున్న అంచనాలు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…