
మీరు మీకు వచ్చే జీతంతోనే మీ డ్రీమ్ బైక్‌ను కొని ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. 10-3-15 అనే నియమాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఈ నియమం ప్రకారం.. మీరు బైక్ కొనాలి అనుకుంటే.. ఆ బైక్ ధరలో 10 శాతం డబ్బును డౌన్ పేమెంట్‌గా చెల్లించండి. మిగతా మొత్తాన్ని మూడేళ్లకు ఈఎమ్‌ఐ కింద కన్వర్ట్ చేసుకోండి. పొరపాటున కూడా ఈ గడువు మూడేళ్లు దాటకుండా చూసుకోండి. అలాగే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ముఖ్యమైన విషయం ఏమింటంటే.. మీ మీ బైక్ కోసం కట్టే ఈఎమ్‌ఐ అనేది మీకు వచ్చే జీతంలో 15 శాతానికి మించకుండా ఉండేలా చూసుకోండి. ఈ నియమాన్ని పాటించడం ద్వారా మీరు బైక్ కొన్న కూడా తర్వాత పెద్దగా ఇబ్బందులు ఉండవు అని నిపుణులు చెబుతున్నారు.
నెలవారీ జీతం రూ.20,000 ఉన్నవారి బైక్ బడ్జెట్ ఎంత?
ఒక వేల మీకు నెలకు రూ. 20,000 జీతం చేతికి వస్తుంటే.. ఈ నియమం ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ.3,000 మించకూడదు. అలాగే మీరు కొనే బైక్ ధర రూ.1లక్షకు మించకూడదు. అంటే మీ బైక్ బడ్జెట్ వచ్చేసి రూ.లక్ష
నెలవారీ జీతం రూ.30,000 ఉన్నవారి బైక్ బడ్జెట్
ఒక వేల మీకు నెలకు రూ. 30,000 జీతం చేతికి వస్తుంటే.. ఈ నియమం ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ.4,500 మించకూడదు. అలాగే మీకు వచ్చే ఈ జీతంతో మీరు రూ.1,62,000 వరకు ధర ఉన్న బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.
నెలవారీ జీతం రూ.50,000 ఉన్నవారి బైక్ బడ్జెట్
ఒక వేల మీకు నెలకు రూ. 50,000 జీతం చేతికి వస్తుంటే.. ఈ నియమం ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ.7,500 మించకూడదు. అలాగే మీకు వచ్చే ఈ జీతంతో మీరు రూ.2,70,000 వరకు ధర ఉన్న బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఈ విధంగా, మీ నెలవారీ జీతానికి సరిపోయే సరైన బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం ద్వారా మీ కలల వాహనాన్ని తెలివిగా కొనుగోలు చేయవచ్చు. ఈ నియమాన్ని కేవలం బైక్ కొనడానికే కాకుండా, ఇతర వస్తువుల కొనుగోళ్లకు కూడా వర్తింపజేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.