Gold Loan: ఎలాంటి సమయాల్లో బంగారు రుణాలు ఉపయోగపడతాయి? ఎలాంటి షరతులు ఉంటాయి?

|

Jan 12, 2023 | 4:43 PM

చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. ఇల్లు నిర్మించేందుకనో.. లేక చదువు, వైద్య ఖర్చు నిమిత్తం ఎన్నో ఆర్థిక అవసరాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి అవసరాల కోసం బ్యాంకు నుంచి..

Gold Loan: ఎలాంటి సమయాల్లో బంగారు రుణాలు ఉపయోగపడతాయి? ఎలాంటి షరతులు ఉంటాయి?
Gold Loan
Follow us on

చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. ఇల్లు నిర్మించేందుకనో.. లేక చదువు, వైద్య ఖర్చు నిమిత్తం ఎన్నో ఆర్థిక అవసరాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి అవసరాల కోసం బ్యాంకు నుంచి రుణాలు పొందుతుంటాము. అయితే బ్యాంకు రుణాలు పొందాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉంటుంది. కానీ ఎలాంటి షరతులు లేకుండా సులభంగా ప్రాసెస్‌ అయ్యేవి బంగారంపై రుణం మాత్రమే. బ్యాంకుల్లో, ఇతర ఫైనాన్షియల్‌ సంస్థల్లో బంగారం తాకట్టు పెట్టి నిమిషాల్లోనే రుణం పొందవచ్చు. ఇతర రుణాలు కావాలంటే సిబిల్‌ స్కోర్‌, తగిన పత్రాలు బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ తదితర వివరాలు ఉండాల్సిందే. కానీ బంగారంపై రుణాలు కావాలంటే ఇలాంటివి ఏవి అవసరం ఉండదు. ఎలాంటి నిబంధనలు ఉండవు. అందుకనే చాలా మంది బంగారంపై రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతేకాదండోయ్‌.. ఇలాంటి వాటికి ఉపయోగపడేందుకు చాలా మంది మహిళలు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతారు. నగలు వేసుకోవచ్చు.. అత్యవసర సమయాల్లో రుణాలు కూడా తీసుకునేందుకు ఉపయోగపడతాయి.

చాలా సందర్భాలలో బ్యాంకులో పొదుపు తక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందుల్లో పడిపోతారు. ఈ పరిస్థితి మెడికల్ ఎమర్జెన్సీ, కాలేజీలో పిల్లల అడ్మిషన్, వివాహం లేదా వ్యాపారం కావచ్చు. ఈ అవసరాలను తీర్చడానికి అనేక రుణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే గోల్డ్ లోన్ ఫ్లెక్సిబిలిటీ పరంగా ఉత్తమమైనది. ప్రతి ఇంట్లో బంగారం ఉండడమే ఉత్తమం. బంగారాన్ని తాకట్టు పెట్టి సులభంగా రుణం పొందవచ్చు.

గోల్డ్ లోన్ కోసం లోన్ టు వాల్యూ (ఎల్‌టీవీ) ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు తనఖాగా పెట్టిన బంగారం విలువలో 75% వరకు రుణం పొందవచ్చు. గోల్డ్ లోన్‌లు ఎలాంటి ఖర్చుకైనా ఉపయోగపడతాయి. గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలంటే ఎలాంటి షరతులు ఉండవు. గోల్డ్ లోన్‌ని ఉపయోగించుకునే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా కొత్త వ్యాపారంతో ముడిపడి ఉన్న రోజువారీ ఖర్చులను తీర్చడానికి మూలధనాన్ని సేకరించడానికి గోల్డ్ లోన్ సరైన మార్గం. గోల్డ్ లోన్‌ల అధిక లోన్-టు-వాల్యూ, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు దీనికి కారణం. గ్రామీణ మహిళలు తమ వ్యాపార ప్రణాళికలను రూపొందించుకోవడానికి, అలాగే వారి స్వంత సంస్థలను స్థాపించడానికి బంగారు రుణాలు మంచి ఆప్షన్‌ అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

విద్యా రుణం:

భారతదేశంలో, విదేశాలలో చదువుల కోసం విద్యా రుణాలను అందించే అనేక ఆర్థిక సంస్థలు ఉన్నాయి. అయితే, ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. బ్యాంకులు సాధారణంగా ఉన్నత స్థాయి సంస్థలలో విద్య కోసం మాత్రమే రుణాలు ఇస్తాయి. అటువంటి పరిస్థితిలో గోల్డ్ లోన్ ఒక మంచి ఆప్షన్‌గా ఉంటుంది. దీనికి ఎటువంటి అర్హత ప్రమాణాలు లేవు. అలాగే, ఈ డబ్బును ఏ రకమైనా, కళాశాలలోనైనా ప్రవేశానికి ఉపయోగించవచ్చు.

అత్యవసర ఖర్చుల కోసం:

కష్టాలు అనేవి ఎప్పుడు చెప్పిరావు. అనుకోకుండా వచ్చేవి. ఇలాంటి సమయంలో తగిన డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటాము. మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఇలాగే ఉంటాయి. మందులు, చికిత్స ఖర్చు ఒక వ్యక్తి కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని తినేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఇంట్లో ఉంచిన బంగారం ఎంతో సహాయపడుతుంది. సులభమైన ప్రాసెసింగ్, త్వరగా డబ్బులు అందుకునేందుకు గోల్డ్‌ లోన్‌ ఉపయోగకరంగా ఉంటుంది. ఎమర్జెన్సీ అవసరాలను తీర్చేందుకు మంచి ఆప్షన్‌. ఇక బంగారం రుణాలు ఇతర ఖర్చులు తీర్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ-వడ్డీ రేట్లతో అందుబాటులో ఉండేది. ఎలాంటి షరతులు లేకుండా తక్కువ సమయంలో రుణాలకు మంచి ఆప్షన్‌. గోల్డ్‌ లోన్‌ ద్వారా ఇంటి మరమ్మతులకు అయ్యే ఖర్చును భర్తీ చేస్తుంది. అంతేకాకుండా ఇతర పెద్ద ఖర్చులు, విదేశీ పర్యటనల వంటి ఖర్చులకు బంగారు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..