Epfo
ప్రతి నెల ఉద్యోగికి సంబంధించిన ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ కోసం డబ్బు వారి జీతం ఖాతాల నుండి తీసివేస్తారు. దానితో పాటు, యజమాని వారి ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు డబ్బును కూడా జమ చేస్తుంది. యజమాని మీ జీతం నుంచి కొంత మొత్తాన్ని తీసివేయడం ద్వారా ప్రతి నెలా పీఎఫ్ డబ్బును డిపాజిట్ చేస్తారు. మీరు ఈ డిపాజిట్లపై వార్షిక వడ్డీని పొందుతారు. సాధారణంగా పీఎఫ్ ఖాతా అనేది జీతం పొందే వ్యక్తి పదవీ విరమణ కార్పస్‌కి మొదటి అడుగుగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి పీఎఫ్ ఖాతా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఈఎపీఎఫ్ తగ్గింపు ఇలా
- ఏ ఉద్యోగికైనా ప్రాథమిక వేతనం, డీఏలో పన్నెండు శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.
- కంపెనీ 12 శాతం కంట్రిబ్యూషన్‌ను కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది.
- కంపెనీ కంట్రిబ్యూషన్‌లో 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది.
- అదే సమయంలో పెన్షన్ పథకంలో 8.33 శాతం డబ్బు జమ అవుతుంది.
- డబ్బు డిపాజిట్ అవుతుందో లేదో తెలుసుకోవడం ఎలా?
- మన పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ అయ్యిందో చాలా మంది నెలల తరబడి తనిఖీ చేయడం లేదు. అయితే ఈపీఎఫ్‌ఓ సైట్‌కి వెళ్లి లాగిన్ అవ్వడం వల్ల చాలా ఈజీగా తెలుస్తుంది.
- మీరు ఎస్‌ఎంస్ ద్వారా కూడా పీఎప్ ఖాతా కోసం తీసివేయబడిన డబ్బు గురించి సమాచారాన్ని పొందుతారు లేదా మీరు కొన్ని ఇతర మార్గాల్లో తనిఖీ చేయాలి.
కంపెనీ పీఎఫ్ జమ చేసిన వివరాలు తెలుసుకోవడం ఇలా
- మీరు మీ ఈపీఎప్ ఖాతా పాస్‌బుక్‌ను తనిఖీ చేయాలి.
- మీ పాస్‌బుక్‌లో ఎప్పుడు, ఎంత డబ్బు జమ చేశారు అనే వివరాలు ఉంటాయి.
- ముందుగా ఈపీఎఫ్ పోర్టల్‌ని సందర్శించాలి. మీకు కేటాయించిన యూఏఎన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి.
- సైట్ ఓపెన్ అయ్యాక మై సర్వీసెస్‌ను ఎంచుకుని ఆపై ‘ఉద్యోగుల కోసం’ డ్రాప్-డౌన్ మెనుని ఎంచుకోవాలి.
- సర్వీస్ కాలమ్ క్రింద ‘సభ్యుని పాస్‌బుక్’పై క్లిక్ చేయాలి.
- తదుపరి పేజీలో మీరు మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ చేయండి.
- లాగిన్ అయిన తర్వాత సభ్యుల ఐడీను ఎంచుకోవాలి. దీని తర్వాత మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. దీనిలో మీరు ఖాతా బ్యాలెన్స్, అన్ని డిపాజిట్ల వివరాలు, స్థాపన ఐడీ, సభ్యుల ఐడీ, కార్యాలయం పేరు, ఉద్యోగి వాటా, యజమాని వాటా గురించి సమాచారాన్ని కూడా పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి