Honda Activa 6G: యాక్టివా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భారీ క్యాష్‌ బ్యాక్‌తో పాటు అదిరే ప్రయోజనాలు.. త్వరపడండి..

|

Sep 18, 2024 | 1:54 PM

హోండా యాక్టివా 6జీ బండిపై పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి బండి కొనుగోలుపై రూ. 5000 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ఫైనాన్సింగ్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా ఒక సంవత్సరం ఉచిత సర్వీస్ మెయింటెనెన్స్ ప్యాకేజీని అందిస్తోంది. దీనికి అనుబంధంగా మూడు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్‌ వారంటీని ఇస్తోంది.

Honda Activa 6G: యాక్టివా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భారీ క్యాష్‌ బ్యాక్‌తో పాటు అదిరే ప్రయోజనాలు.. త్వరపడండి..
Honda Activa 6g
Follow us on

మన దేశంలో ద్విచక్ర వాహనాల్లో స్కూటర్లకు మంచి డిమాండ్‌ ఉంది. కేవలం మహిళలు మాత్రమే కాక పురుషులుకూడా వినియోగించుకునే అవకాశం ఉండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. అలాగే ఇంట్లో అవసరాలకు బాగా ఉపకరిస్తుండటంతో వాటి వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో చాలా పెద్ద కంపెనీలకు చెందిన స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో హోండా యాక్టివా క్రేజ్‌ వేరు. అటు యువకులు, పెద్ద వారు, మహిళలు అందరూ దీనిని ఇష్టపడతారు. దీంతో యాక్టివాకు మన మార్కెట్లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. అత్యధిక సేల్స్‌ సైతం ఈ బండి రాబడుతోంది. కాగా దీనిని మరింత పెంచుకునేందుకు జపనీస్‌ బ్రాండ్‌ అయిన హోండా తలంచింది. అందుకు ఈ ఫెస్టివల్‌ సీజన్‌ను అస్త్రంగా వినియోగిస్తోంది. హోండా యాక్టివా 6జీ బండిపై పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి బండి కొనుగోలుపై రూ. 5000 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ఫైనాన్సింగ్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా ఒక సంవత్సరం ఉచిత సర్వీస్ మెయింటెనెన్స్ ప్యాకేజీని అందిస్తోంది. దీనికి అనుబంధంగా మూడు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్‌ వారంటీని ఇస్తోంది. ఇంకా ద్విచక్ర వాహనంతో కనీస వడ్డీ రేటు 7.99 శాతం అందిస్తోంది. ఈ ఆఫర్లు 2024 సెప్టెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ధర ఎంతంటే..

హెూండా యాక్టివా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి. చాలా కాలంగా హోండా బ్రాండ్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌ కూడా ఇదే. ఈద్విచక్ర వాహనం ప్రారంభ ధర రూ. 76,684 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.అత్యంత ఖరీదైన వేరియంట్ ధర రూ.82,684 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. పలు రకాల రంగుల్లో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంది. డీసెంట్ బ్లూ మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ, బ్లాక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, రెబెల్ రెడ్ మెటాలిక్ మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

అత్యాధునిక ఫీచర్లు..

యాక్టివా అవుట్‌ గోయింగ్‌ జనరేషన్లోని ఫీచర్లను పరిశీలిస్తే.. స్మార్ట్ కీ, స్మార్ట్ సేఫ్ (యాంటీ థెఫ్ట్ ఫంక్షన్), స్కూటర్‌ను గుర్తించే ఫీచర్, బయట ఫ్యూయల్ క్యాప్, అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఈ స్కూటర్లో 109.51 సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్. ఈ పవర్ యూనిట్ 7బీహెచ్‌పీ శక్తిని, 8.90ఎన్‌ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో 3 దశల సర్దుబాటు సస్పెన్షన్‌ ఉంటుంది. హెూండా యాక్టివా మార్కెట్లోని టీవీఎస్ జూపిటర్, హీరో ప్లెజర్ ప్లస్ వంటి మోడళ్లకు పోటీగా ఉంది. ఇటీవల అప్డేట్ చేయబడిన జూపిటర్ ప్రారంభ ధర రూ. 73,700 (ఎక్స్-షోరూమ్), అయితే అత్యంత ఖరీదైన వేరియంట్ ధర రూ. 87,250 (ఎక్స్-షోరూమ్). అదే సమయంలో, హీరో ప్లెజర్ ప్లస్ ప్రారంభ ధర రూ. 71,213 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..