ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండాకు భారత మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత టూ వీలర్ మార్కెట్లో తనకంటూ వాటను సంపాదికుందీ కంపెనీ. ఒకప్పుడు బైక్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన హెండా ఇప్పుడు స్కూటర్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. స్కూటర్ సెగ్‌మెంట్‌లో సత్తా చాటుతోన్న హోండా తాజాగా మరో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. మోండా మోటార్ సైకిల్ అండ్ స్కూట్ ఇండియా.. భారత మార్కెట్లోకి హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను లాంచ్ చేసింది.
హోండా యాక్టివా స్కూటీలకు ఇండియన్ టూవీలర్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలోనే ఈ కొత్త వెర్షన్ స్కూటీని తీసుకొచ్చింది. హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఈ స్కూటీని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. హోండా ఈ స్కూటీలో కీ లెస్ ఇంజన్ స్టార్ట్/ ‘స్టాప్ విత్ యాంటీ థెఫ్ట్ అనే సిస్టమ్‌తో తీసుకొచ్చింది. కేవలం కార్లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను స్కూటీలో తీసుకురావడం విశేషం. ఇక హోండా ఈ స్కూటీని యాక్టీవా డీలక్స్ లిమిటెడ్, యాక్టీవా స్మార్ట్ లిమిటెడ్ ఎడిషన్ అనే పేర్లతో లాంచ్ చేసింది.
ధర విషయానికొస్తే యాక్టీవా డీలక్స్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 8,743 (ఎక్స్ షోరూమ్)గా ఉండగా, యాక్టీవా స్మార్ట్ లిమిటెడ్ ఎడిష్ ధర రూ. 82,734 (ఎక్స్ షోరూమ్)గా ఉన్నాయి. ఇక ఈ స్కూటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్యాడీ ప్యానెల్స్‌పై సస్ట్రైప్ గ్రాఫిక్స్‌తో బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్స్, డార్క్ కలర్ థీమ్ ఫీచర్స్‌ను అందించారు. ఇక రెయిర్ గ్రాబ్ రైల్ పై బ్లాక్ క్రోమ్ గార్నిష్‌తో పాటు యాక్టీవా 3డీ లోగోను ఇచ్చారు. బాడీ కలర్ డార్క్ ఫినిష్‌తో ఇచ్చారు.
ఈ స్కూటీలను మ్యాట్టె స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సిరెన్ బ్లూ కలర్స్‌లో లాంచ్ చేశారు. ఫైవ్ స్పోక్ అలాయ్ వీల్స్‌తో ఈ స్కూటీని లాంచ్ చేశారు. ఈ స్కూటీని హై ఎండ్ వేరియంట్ హోండా స్మార్ట్ కీ టెక్నాలజీతో రూపొందించారు. ఇక హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ 109.52 సీసీ సింగిల్ సిలిండర్, న్యూ ఓబీడీ2 ఎమిషన్‌కు అనుగుణంగా ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను ఇచ్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.73 బీహెచ్‌పీ విద్యుత్, 8.84 ఎన్‌ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..