హోండా కార్స్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మోడల్ కార్లు 77,954 యూనిట్లను రీ కాల్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. ఫాల్ట్ ఫ్యూయల్ పెట్రోల్ పంపులను రీప్లేస్ చేయడానికి ఈ సిద్ధమైనట్లుగా కంపెనీ తెలిపింది. స్టార్ట్ కాని, ఇంజిన్లు నిలిచిపోయిన కార్లలో ఫ్యూయల్ పంపులను ఇన్‌స్టాల్ చేస్తామని హోండా ఓ ప్రకటనలో వెల్లడించింది. అమేజ్, ఫోర్త్ జనరేషన్ సిటీ, డబ్ల్యూఆర్-వీ, జాజ్, సివిక్, బీఆర్-వీ, సీఆర్వీ మోడల్ కార్లను రీ కాల్ చేసినట్లు వెల్లడించింది. 2019 జనవరి- 2019 సెప్టెంబర్ మధ్య తయారైన కార్లను ఇది వర్థిస్తుందని చెప్పింది.
2019 జనవరి- ఆగస్టు మధ్య ఉత్పత్తయిన 36,086 యూనిట్ల అమేజ్, 2019 జనవరి-సెప్టెంబర్ మధ్య తయారైన 20,248 యూనిట్ల ఫోర్త్ జనరేషన్ సిటీ కార్లు రీకాల్ చేస్తున్నది. అలాగే 2019 జనవరి- ఆగస్టు మధ్య నిర్మించిన 7,871 డబ్ల్యూఆర్-వీ యూనిట్లు, 6,235 యూనిట్ల జాజ్ మోడల్ కార్లు కూడా రీ-కాల్ చేసిన జాబితాలో ఉన్నాయి.
2019 జనవరి-సెప్టెంబర్ మధ్య ఉత్పత్తైన 5,170 యూనిట్లు సివిక్, 2019 జనవరి-అక్టోబర్ మధ్య తయారైన 1737 యూనిట్లు బీఆర్‌వీ, 2019 జనవరి- 2020 సెప్టెంబర్ మధ్య మాన్యూఫాక్చరైన 607 యూనిట్ల సీఆర్వీ మోడల్ కార్లకు ఇందులో వస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఉచితంగా ఈ కార్లలో దశలవారీగా ఫ్యూయల్ పంపులను రీప్లేస్‌మెంట్ చేస్తామని హోండా కార్స్ ఇండియా ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 17వ తేదీ నుంచి కార్ల రీప్లేస్‌మెంట్ ప్రారంభం అవుతుందన్నది.
గతేడాది జూన్‌లో కూడా అమేజ్, సిటీ, జాజ్ సహా పలు మోడల్ 65,651 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. 2018లో తయారైన ఫాల్టీ ఫ్యూయల్ పంప్స్ రీ ప్లేస్ చేసింది.
Also Read:
తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..
ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ వాయిదా..