ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ఎక్కువగా ఈవీ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు కూడా కొత్త కొత్త ఈవీలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే టూ వీలర్స్ విషయంలో ఈ చర్యలు మరింత వేగంగా ఉన్నాయి. టూ వీలర్స్ పెట్రో వాహనాల మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న హోండా ఈవీ వాహనాల రిలీజ్‌లో మాత్రం వెనుకంజలో ఉంది. ఇటీవల ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడమే అందుబాటులోకి వచ్చిన దాఖలాలు లేవు. హోండా ప్రత్యర్థిగా ఉన్న హీరో, టీవీఎస్ వంటి సంస్థలు ఈవీ మార్కెట్‌లో దూసుకుపోతున్నా హోండా మాత్రం ఈవీ వాహనాలను మాత్రం రిలీజ్ చేయడం లేదు. ప్రస్తుతం హోండా కంపెనీ హోండా బెన్లీ పేరుతో సరికొత్త ఈవీ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ధర విషయంలో ఎలాంటి అంచనాలు లేకపోయినా ఫీచర్ల విషయానికి వస్తే మాత్రం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. హోండా రిలీజ్ చేసిన బెన్లీ స్కూటర్ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం
హోండా బెన్లీ స్కూటర్ 2019లో జరిగిన టోక్యో మోటార్ షోలో ప్రదర్శించారు. ముఖ్యంగా లాజిస్టిక్స్, పిక్-అప్‌తో పాటు డెలివరీ సేవలు అందించడానికి ఈ స్కూటర్ అనువుగా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ట్విన్-బ్యాటరీ డిజైన్‌తో వస్తుంది. ప్రతి బ్యాటరీ పరిమాణం 0.99 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లోని రెండు బ్యాటరీలను స్విచ్ అవుట్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది. అలాగే చార్జింగ్ సమయంలో అనవసరమైన నిరీక్షణ అసౌకర్యం నుంచి బయటపడేస్తుంది. బెన్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా 4 వెర్షన్లల్లో అందుబాటులో ఉంది. బెన్లీ 1, బెన్లీ 1 ప్రో, బెన్లీ ఈ 2, బెన్లీ 2 ప్రో వెర్షన్లలో వినియోగదారులను పలకరిస్తుంది. ఈ స్కూటర్లను ఓ సారి ఛార్జ్ చేస్తే 87 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తాయి. అలాగే గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకుపోతాయి. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ స్వాప్ చేసే బ్యాటరీ సాంకేతికత కోసం పరీక్షిస్తున్నారు. అలాగే హోండా నుంచి వచ్చే ఈ స్కూటర్ బేస్ మోడల్ 2.8 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. అయితే ఇతర వెర్షన్లు 4.2 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. అయితే అన్ని మోడల్స్ స్కూటర్లల్లో రెండు తొలగించగల 48వీ బ్యాటరీలు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..