Honda Cars: ఆ కారు స్పోర్ట్ ఎడిషన్ రిలీజ్ చేసిన హోండా.. స్టన్సింగ్ లుక్‌తో అదిరే ఫీచర్స్

సొంత కారు అనేది భారతదేశంలోని మధ్య తరగతి కుటుంబాలకు కలగా ఉంటుంది. అయితే దేశంలో ఉన్న జనాభాలో ఎక్కువ శాత మధ్యతరగతి కుటుంబాలే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు చాలా కంపెనీ తక్కువ ధరలో స్పోర్టీ లుక్‌తో కొత్త కార్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా హెూండా కార్స్ ఇండియా కొత్త సిటీ స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Honda Cars: ఆ కారు స్పోర్ట్ ఎడిషన్ రిలీజ్ చేసిన హోండా.. స్టన్సింగ్ లుక్‌తో అదిరే ఫీచర్స్
Honda City Sport Edition

Updated on: Jun 21, 2025 | 3:45 PM

హెూండా కార్స్ ఇండియా కొత్త సిటీ స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్‌ను రూ.14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఈ కారులో యువతను ఆకర్షించేలా అవుటర్‌తో పాటు ఇంటీరియర్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. న్యూ సిటీ స్పోర్ట్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ విభాగంలో వోక్స్ వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నాతో పోటీ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సిటీ స్పోర్ట్ ఎడిషన్ సెడాన్‌కు సంబంధించిన అవుటర్ వ్యూ మాదిరి తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఈ కారు క్రోమ్ గ్రిల్ నలుపు రంగులో ఆకట్టుకుంటుంది. అలాగే వెనుక స్పాయిలర్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఓఆర్‌వీఎంలు క్రిస్టల్ బ్లాక్ ఫినిషింగ్‌తో వస్తున్నాయి. మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ మెటాలిక్ గ్రే రంగులో ఆకట్టుకుంటుంది. షార్క్-ఫిన్ యాంటెన్నా కూడా గ్లోస్-బ్లాక్ రంగులో డిజైన్ చేశారు. ముఖ్యంగా బూట్ పై ‘స్పోర్ట్’ చిహ్నం ఉంది.

హెూండా కార్స్ ఇండియా కొత్త సిటీ స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్‌ క్యాబిన్ ఫుల్ బ్లాక్ ఇంటీరియర్‌తో వస్తుంది. అలాగే డాష్ బోర్డ్ పై ఎరుపు రంగుతో ఉంటుంది. సీట్లు కాంట్రాస్ట్ ఎరుపు రంగు స్టిచింగ్‌తో  బ్లాక్ లెథరెట్లో అష్టోల్స్టర్ చేశారు. కొత్త సాఫ్ట్ టచ్ డోర్ ఇన్సర్ట్లు ఆకట్టుకుంటాయి. అలాగే ఏసీ వెంట్స్, స్టీరింగ్ వీల్ కూడా నలుపు రంగులో ఉంటాయి. ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే హెూండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ 119 బీహెచ్‌పీ గరిష్ట శక్తి 145 ఎన్ పీక్ టార్క్ ఉత్పత్తి చేసేలా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

హెూండా కార్స్ ఇండియా కొత్త సిటీ స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్‌ 7 స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. సిటీ ఆటోమేటిక్ పై ఆటోమేకర్ 18.40 కిలోమీటర్ల ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ ఇస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే సిటీ స్పోర్ట్ ఎడిషన్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్, నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎంఐడీ యూనిట్ తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, లెవెల్ 2 ఏడీఏఎస్ మరెన్నో ఫీచర్లు ఆకట్టుకుంటాయి. హెూండా సిటీ స్పోర్ట్ మూడు రంగు ఎంపికల్లో ఉంటుంది. ప్లాటినం వైట్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ కలర్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న హెూండా డీలర్షిప్‌ల అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి