Festival sales: డిస్కౌంట్‌లతో పాటు అధిక లాభం.. ఆన్‌లైన్ షాపింగ్‌‌లో ప్రత్యేకం

|

Oct 02, 2024 | 6:15 PM

పండగల సందర్భంగా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం భారతీయుల సంప్రదాయం. కార్లు, ద్విచక్ర వాహనాలతో పాటు ఇంట్లోకి అవసరమైన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిని ఈ సమయంలో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. వినాయక చవితి వేడుకలు ముగియగా, దసరా ప్రారంభమవుతోంది. దీని వెనుకే దీపావళి రానుంది. ఈ నేపథ్యంలో పండగ విక్రయాలు జోరందుకున్నాయి. మార్కెట్ లో వివిధ వస్తువులపై ఆఫర్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్ హవా కొనసాగుతోంది.

Festival sales: డిస్కౌంట్‌లతో పాటు అధిక లాభం.. ఆన్‌లైన్ షాపింగ్‌‌లో ప్రత్యేకం
Online Shopping
Follow us on

పండగల సందర్భంగా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం భారతీయుల సంప్రదాయం. కార్లు, ద్విచక్ర వాహనాలతో పాటు ఇంట్లోకి అవసరమైన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిని ఈ సమయంలో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. వినాయక చవితి వేడుకలు ముగియగా, దసరా ప్రారంభమవుతోంది. దీని వెనుకే దీపావళి రానుంది. ఈ నేపథ్యంలో పండగ విక్రయాలు జోరందుకున్నాయి. మార్కెట్ లో వివిధ వస్తువులపై ఆఫర్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్ హవా కొనసాగుతోంది. మార్కెట్ ధరల కన్నా తక్కువకే వస్తువులు అందుబాటులో ఉండడంతో ప్రజలు అక్కడ షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంట్లోనే కూర్చుని షాపింగ్ చేసుకునే వీలు ఉండడంతో పాటు, వస్తువులను మన ఇంటికే తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ షాపింగ్ కు ఆదరణ పెరిగింది. సాధారణంగా ఆన్ లైన్ షాపింగ్ లో ఇ-కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందజేస్తున్నాయి. ప్రజలందరూ వాటినే గమనిస్తారు. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరిన్ని డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

పండగ సేల్ ప్రారంభం

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పండగ సేల్ ను ప్రారంభించాయి. వీటిలో అనేక వస్తువులను భారీ తగ్గింపు ధరకు అందిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బిగి బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. వీటిలో సెల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, వాటర్ ఫూర్యిఫైయర్లు, వాటర్ కూలర్లు, కిచెన్ సామగ్రి, టీవీలు… ఇలా అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వీటితో పాటు డబ్బులను మరింత ఆదా చేయాలనుకుంటే ఈ కింద విషయాలను పాటిస్తే డిస్కౌంట్ తో పాటు అదనంగా తగ్గింపులు పొందవచ్చు

క్రెడిట్, డెబిట్ కార్డులు

షాపింగ్ సమయంలో క్రెడిట్ , డెబిట్ కార్డులతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. లావాదేవీలను వీటిని ఉపయోగిస్తే మరిన్ని తగ్గింపులు పొందవచ్చు. వీటికి ఇ-కామర్స్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంకు, అమెజాన్ లో ఐసీఐసీఐ కార్డులపై ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. వారిచ్చే డిస్కౌంట్ కు ఇది అదనంగా ఉంటుంది. అలాగే పండగ సేల్ లో ఎస్ బీఐ కార్డులను ఉపయోగించి లావాదేవీలు చేయడం వల్ల పదిశాతం తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎక్స్చేంజ్ ఆఫర్లు

అమెజాన్, ఫ్లిప్ కార్డ్ సంస్థలు వివిధ ఎక్స్చేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు పాత ఫోన్ ను మార్చుకోవాలనుకుంటున్నారు. పండగ సేల్ లో ప్రకటించిన ఎక్స్చేంచ్ ఆఫర్ లో దాన్ని ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి.

ముందస్తు యాక్సెస్

సేల్ ప్రారంభానికి ముందు ఎంపిక చేసిన కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఇ-కామర్స్ సంస్థలు ప్రత్యేక డీల్స్ అందుబాటులోకి తెస్తాయి. ప్రీమియం సబ్ స్కైబర్లు దీనికి అర్హులు, సాధారణ ప్రజల కంటే ముందుగానే వీరు వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రైమ్ సభ్యులకు ఒక్క రోజు ముందుగానే సేల్ తెరవబడుతుంది. దీనివల్ల తక్కువ సంఖ్యలో ఉన్న బెస్ట్ స్టాక్ ను కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి